Telugu Global
Health & Life Style

మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిజం ఇదే

మామిడిలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున మొటిమల పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిజం ఇదే
X

వేసవికి మరో పేరు మామిడి పండు. ఎందుకంటే వేసవిలో మాత్రమే ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. రుచికరమైన నోరూరించే ఈ పండ్ల కోసం అందరూ సంవత్సరమంతా ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. వీటిలోని బీటా కెరోటిన్‌ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు. రుచికరమైన పండులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి చాలా అవసరం. కానీ అదేంటో జ్యూసీగా ఉండే మామిడి పండు తినగానే అమ్మాయిలకు మొహం మీద లావుగా మొటిమలు దర్శనమిచ్చేస్తాయి.



మామిడిలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున మొటిమల పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. మామిడి మాత్రమే కాదు చాక్లెట్లు, క్యాండీలు, పేస్ట్రీలు, జంక్ ఫుడ్ మొదలైనవి కూడా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మన శరీరంలో చెక్కెర స్థాయిని పెంచుతాయి. ఇది సెబమ్ స్రావాన్ని పెంచడం ద్వారా మన నూనె గ్రంథులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు మామిడి పండ్లను పండించడానికి వాడే కృత్రిమ ఎరువులు, స్ప్రే లు కూడా మన చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు మొటిమలను కలిగిస్తాయి.

మొటిమల సమస్యలను దూరం చేయండిలా..

చర్మం మీద మొటిమలు రాకుండా ఉండాలంటే మామిడి పండుని తినటానికి ముందు రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఎందుకంటే నీటిలో పెట్టడం వల్లమామిడిపండులో ఉండే ఫైటిక్ యాసిడ్‌ నశిస్తుంది.

మామిడి పండు తినడం వల్ల వచ్చే వేడిని తగ్గించేందుకు ఒక గ్లాసు పాలు తాగితే మంచిది.

మామిడిని ఒక పండులానే తినండి. అంటే మామిడిని భోజనంలోనో, పెరుగుతోనో కలిపి అసలు తినకూడదు. శరీరంలో వేడిని పెంచుతుంది.

First Published:  27 May 2024 1:36 PM GMT
Next Story