ఉప్పుతో ముప్పు ఉందా?
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది.

పొట్ట క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది ఇటీవల చాలా ఎక్కువమందిలో కనిపిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే పొట్ట క్యాన్సర్ కు ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే కారణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పొట్ట క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ల సంఖ్య ఇటీవలికాలంలో పెరిగింది. ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కడుపులోని కణాలు అసాధారణంగా ఎదిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. లైఫ్‌స్టైల్ , ఆహారపు అలవాట్లలో మార్పులే ఈ క్యాన్సర్‌కు ముఖ్యకారణమని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉప్పు, నైట్రేట్‌లు ఉన్న ఆహారాలే వీటికి కారణమట.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది. ఉన్నట్టుండి బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలి తగ్గడం, కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు లాంటివి పొట్ట క్యాన్సర్ లక్షణాలు. కారం, ఉప్పు అవసరాన్ని మించి ఉపయోగించడం వల్ల పొట్ట క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందట. అలాగే వంశపారపర్యంగా, స్మోకింగ్, రకరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా పొట్ట క్యాన్సర్ రావొచ్చు.
స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆహారంలో ఉప్పు, కారాలను తగ్గిచాలని చెప్తున్నారు. తృణధాన్యాల , ముడి బియ్యం లాంటివి డైట్‌లో చేర్చుకుని, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉంటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.