Telugu Global
Health & Life Style

ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే తెలుసా మీకు

సాధారణంగా స్త్రీలకి 50 ఏళ్ళు వచ్చేసరికి సహజంగా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ మెల్లమెల్లగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది.

ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే తెలుసా మీకు
X

సాధారణంగా స్త్రీలకి 50 ఏళ్ళు వచ్చేసరికి సహజంగా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ మెల్లమెల్లగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. ఇది చాలా నిదానంగా, స్థిరంగా కొనసాగుతుంది. ఇది శాశ్వతమైన, సహజమైన మార్పే తప్ప జబ్బుకాదు. మహిళల జీవితంలో ఇది ఒక దశ. ఈ దశలో శరీరంలో పెద్దగా ఎలాంటి మార్పులూ కనిపించకపోవచ్చు. సాధారణ మెనోపాజ్‌లో పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ, రక్తస్రావం తక్కువగా అవుతుంది. మెనోపాజ్ సగటు వయసు 48 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఈ వయసులో మరికొన్ని వ్యాధులు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు 50-51 వరకు కూడా పీరియడ్స్ కొనసాగుతాయి.


అయితే 40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ఒకవేళ పీరియడ్స్ 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఆగిపోతే, దీన్ని ‘ఎర్లీ మెనోపాజ్’గా చెబుతారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల ఆర్థిక పరిస్థితి, పోషకాహారం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు,వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌‌కు కారణమవుతాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్‌కు ఇచ్చే కీమోథెరపీ, రేడియోథెరపి లాంటివి కూడా పీరియడ్స్ త్వరగా ఆగిపోయేందుకు కారణాలుగా ఉంటున్నాయి. చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి కూడా తొందరగా, అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి.

పరిస్థితుల బట్టి పీరియడ్స్ ఆగిపోతే భారతీయ మహిళలలు చాలా ఆనందిస్తారు. కానీ నిజానికి పీరియడ్స్ కొనసాగుతున్నంత కాలం మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ అనే రెండు హార్మోన్లు బాగా పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ పీరియడ్స్ ముందుగానే ఆగిపోతే, ఈ రెండు హార్మోన్ల సంఖ్య మహిళల శరీరంలో తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల మహిళల శరీరం, మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మహిళలకు మెనోపాజ్ వచ్చిన తర్వాత గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఊబకాయం, రక్త పోటు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివి కూడా పెరుగుతాయి.



ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేందుకు కారణమవుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గిచేందుకు, ఒకవేళ ప్రీమెచ్యూర్‌గా పీరియడ్స్ ఆగిపోయినా కనీసం 45 ఏళ్ల వరకు పీరియడ్స్ కొనసాగేలా డాక్టర్ సూచనలను పాటించాలి. పీరియడ్స్ సరైన సమయంలో రాకపోతే ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మెనోపాజ్ లాగా భావించి 35 ఏళ్ల తర్వాత వచ్చే ఏదైనా అనారోగ్య పరిస్థితిని పట్టించుకోకపోతే, అది ప్రమాదానికి దారి తీస్తుంది. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా సాధారణం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన వైద్య సలహా, చెకప్‌లు చేయించుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కూడా మహిళలు ఇంకా 30 నుంచి 35 ఏళ్ల వరకు జీవిస్తారు. ఈ కాలం సాఫీగా కొనసాగాలి అంటే ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి. అందుకే మీకు 35 ఏళ్ల తర్వాత రుతుక్రమం ఆగిపోయింది అనగానే.. హమ్మయ్య ఒకపని అయిపోయింది అని అనుకోకుండా సకాలంలో వైద్య సలహా తీసుకోండి. కచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. మెనోపాజ్ వయమహిళలు సు 48 నుంచి 49 ఏళ్లు, ఆపైనే ఉంటుంది.

First Published:  10 Jan 2024 12:00 PM IST
Next Story