Telugu Global
Health & Life Style

ఆక్సిజన్ ఫేషియల్ గురించి తెలుసా?

స్వచ్ఛమైన ఆక్సిజన్ కణాలతో చేసే ఈ ఫేషియల్ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ ఫేషియల్ వల్ల చర్మానికి సాగే గుణం తగ్గి వయసు పైబడిన ఛాయలు కనిపించకుండా ఉంటాయి.

ఆక్సిజన్ ఫేషియల్ గురించి తెలుసా?
X

ముఖాన్ని మెరిపించేందుకు రకరకాల ఫేషియల్స్ ట్రై చేస్తుంటారు చాలామంది. అయితే రీసెంట్‌గా ఆక్సిజన్ ఫేషియల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. తక్కువ టైంలో ముఖాన్ని బ్రైట్‌గా మార్చే ఈ ఫేషియల్ ఎలా ఉంటుందంటే..

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ ట్రెండ్స్‌లో ఆక్సిజన్ ఫేషియల్ కూడా ఒకటి. ఈ ఫేషియల్‌లో భాగంగా గాఢత ఎక్కువగా ఉండే ఆక్సిజన్ సెల్స్‌ను ముఖంపై స్ప్రే చేస్తారు. దీన్ని లైట్, సీరం, మసాజ్.. ఇలా మూడు స్టెప్స్‌లో చేస్తారు. ఈ ఫేషియల్ ద్వారా చర్మంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందుతాయి. ఈ ఫేషియల్ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

లాభాలివే..

స్వచ్ఛమైన ఆక్సిజన్ కణాలతో చేసే ఈ ఫేషియల్ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ ఫేషియల్ వల్ల చర్మానికి సాగే గుణం తగ్గి వయసు పైబడిన ఛాయలు కనిపించకుండా ఉంటాయి.

ఆక్సిజన్ ఫేషియల్ చర్మంపై పేరుకున్న జిడ్డు, మలినాలు, మృతకణాలు వంటివి తొలగిపోతాయి. అలాగే చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలను తెరచుకుంటాయి. చర్మం మరింత బ్రైట్‌గా మారుతుంది.

కాలుష్యం కారణంగా చర్మంలో నశించిన కణాలు ఈ ఫేషియల్ ద్వారా తిరిగి అందుతాయి. అక్సిజన్ ఫేషియల్ ద్వారా చర్మంలో అధిక సంఖ్యలో కొత్త కణాలు ఏర్పడతాయి. తద్వారా ముఖం మరింత తాజాగా కనిపిస్తుంది.

ఆక్సిజన్ ఫేషియల్ ద్వారా చర్మం కోల్పోయిన తేమను తిరిగి సంతరించుకుంటుంది. ఇది చర్మపు లోపలి పొరలకు కూడా తేమను, ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఆక్సిజన్ ఫేషియల్‌తో ముఖంపై మచ్చలు, మొటిమలు లాంటివి తగ్గుతాయి. చర్మ సమస్యలను నయం చేసే గుణం కూడా ఈ ఫేషియల్‌కు ఉంది.

ఆక్సిజన్ ఫేషియల్‌ను నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చర్మ సమస్యలు ఉన్నవాళ్లు స్కిన్ స్పెషలిస్ట్ సలహా తీసుకోవాలి

First Published:  15 Sept 2022 5:45 AM GMT
Next Story