Telugu Global
Health & Life Style

చలికాలంలో కూడా 8 గ్లాసుల నీళ్ళు తాగాల్సిందేనా ?

మమ్ములుగానే మనలో చాలామందికి మంచినీరు తాగటం మీద శ్రద్ద ఉండదు.

చలికాలంలో కూడా 8 గ్లాసుల నీళ్ళు తాగాల్సిందేనా ?
X

మమ్ములుగానే మనలో చాలామందికి మంచినీరు తాగటం మీద శ్రద్ద ఉండదు. ఇక బయట వాతావరణం చల్ల ఉన్నప్పుడు మళ్ళీ లీటర్ల కొద్దీ నీరు తాగాలా అని అనిపించడం సర్వ సాధారణం. .. కానీ నిజానికి నీటికి సీజన్ కి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే మానవ శరీరంలో నీరు చాలా ముఖ్యమైనది. శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. అన్ని అవయవాల పనితీరు సక్రమంగా ఉండాలంటే తప్పనిసరిగా తగినంత నీరు తాగాలి. లేదంటే శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. వేసవి కాలంలో అయితే ఎండ వేడి తట్టుకోలేక ఎక్కువగా నీటిని తాగుతాం. కానీ ఈ శీతాకాలంలో దాహం వెయ్యదు.

అసలు నీళ్లు తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. నిజానికి ఈ కాలంలో మనకి చెమట పట్టదు కానీ, చలి గాలులకి బాడీలో నుంచి మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులకి డీహైడ్రేషన్ కారణం అవుతుంది. అందుకే కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు తప్పనిసరిగా 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో నీతి శాతం తగ్గినప్పుడు చక్కెర, లవణాలు వంటి ఖనిజల సమతుల్యతని దెబ్బతీస్తుంది. ఇది శరీర పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.

అయితే చలికాలంలో ఎక్కువగా నీళ్ళు తాగలేము అనుకునే వాళ్ళు నీటిని వేర్వేరు రకాలుగా తీసుకోవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం తగిన పోషకాలు అందించే సూప్ లు వంటి ఇతర అనేక మార్గాల ద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చు. వెచ్చగా ఉండే సూప్ లో ప్రోటీన్లు, విటమిన్లతో పాటు నీరు కూడా ఉంటుంది.

ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే నీటికి బదులు తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఈ రెండూ చలికాలంలో వచ్చే ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్లకి వ్యతిరేకంగా పోరాడతాయి. అలాగే కొబ్బరి నీళ్ళు, హెర్బల్ టీ, గ్రీన్ టీ, పెరుగు కూడా నీటికి ప్రత్యామ్నాయమే.

First Published:  8 Dec 2023 10:30 AM IST
Next Story