మీలో సూపర్ ఎమోషన్స్ ఉన్నాయా?
ఎమోషన్ అనేది మనిషికి మాత్రమే ఉండే అందమైన అనుభూతి. ఒక వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్, బిహేవియర్ ఈ మూడింటి మీద ఎమోషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఎమోషన్ అనేది మనిషికి మాత్రమే ఉండే అందమైన అనుభూతి. ఒక వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్, బిహేవియర్ ఈ మూడింటి మీద ఎమోషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ ఎమోషన్స్ ఒక్కో మనిషిలో ఒక్కో లెవల్‌లో ఉంటాయి. అవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో కంట్రోల్ చేసుకోగలిగే స్థాయిలో ఉంటే ఓకే. కానీ ఒక్కోసారి మరీ సెన్సిటివ్‌గా మారి ఒత్తిడికి, డిప్రెషన్‌కి దారితీస్తాయి. అందంగా ఉండే ఎమోషన్స్.. భయంకరంగా మారతాయి. అప్పుడు వాటిని ఎమోషన్స్ కాదు.. ‘సూపర్ ఎమోషన్స్’ అంటారు.
ఊరికే కోప్పడడం, ఎమోషనల్‌గా ఒకరికి బానిస అవ్వడం, చిన్నచిన్న వాటికే తట్టుకోలేకపోవడం.. ఇలాంటివన్నీ సూపర్ ఎమోషన్స్ కిందకు వస్తాయి. సూపర్ ఎమోషన్స్ వల్ల ఒక వ్యక్తి ఫ్యూచర్ ఎంతగానో దెబ్బతింటుంది. ఇవి మనిషిపై మెంటల్‌గా, ఫిజికల్‌గా నెగెటివ్ ఎఫెక్ట్‌ను చూపుతాయి. వీటివల్ల నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం, ఏకాగ్రత తగ్గిపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, కుంగుబాటు, నిరుత్సాహం, చిరాకు, భయం, ఆందోళన లాంటివి కలుగుతాయి. ఇవి ఒక్కోసారి సూసైడ్ వరకూ తీసుకెళ్తాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిపై కంట్రోల్ అవసరం.
ఏం చేయాలి?
ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయాలంటే ముందుగా వాటిపై ఓ అవగాహనకు రావాలి. ఏ ఎమోషన్ ఎప్పుడు విపరీతంగా బాధపెడుతుందో తెలుసుకోకుండా వాటిని అదుపులో ఉంచడం కష్టం. అందుకే, వస్తున్న ఎమోషన్స్‌ను అబ్జర్వ్ చేయాలి. ఏ సమయంలో ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవాలి.
ఒకసారి ఎలాంటి ఎమోషన్స్ ఇబ్బంది పెడుతున్నాయో తెలుసుకున్నాక, ఇప్పుడు ఆ ఎమోషన్ ‘ఎందుకు’ కలిగిందో తెలుసుకోవాలి. ‘అసలు తప్పు ఎక్కడొచ్చింది? నేను ఈ విధంగాఫీల్ అవడానికి కారణాలేంటి?’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనసు కూడా సమాధానం కోసం చూస్తుంది. సాధారణంగా.. ఒక్కోసారి జరిగిన సిచ్యుయేషన్‌ని మనం చూసే కోణం వల్ల కూడా కొన్ని భావోద్వేగాలు కలగొచ్చు. అందుకే ప్రతీ ఎమోషన్‌కు ‘ఎందుకు?’ అనే ప్రశ్న వేసుకోవడం ముఖ్యం.
‘ఎందుకు?’ అనేది తెలుసుకున్న తర్వాత.. వాటికి సొల్యూషన్ ఆలోచించాలి. ఆలోచనలే ఎమోషన్స్‌కు కారణం కాబట్టి ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులు చేయొచ్చో తెలుసుకోవాలి. ఎమోషన్.. నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందంటే... మన థింకింగ్ నెగెటివ్‌గా ఉన్నట్టు లెక్క. అందుకే ప్రతీ విషయంలో పాజిటివ్‌గా స్పందించడం ఎలాగో నేర్చుకోవాలి. పరిస్థితిని డిఫరెంట్ యాంగిల్స్‌లో చూడడం మొదలుపెడితే.. బెటర్‌గా ఫీలయ్యే అవకాశాలుంటాయి.
ఇలా చేస్తూ.. ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయకుండా.. మనమే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసేలా బ్రెయిన్‌ని ట్యూన్ చేయాలి. ఈ ఒక్క టెక్నిక్ ప్రాక్టీస్ చేసి, సక్సెస్ అయితే... లైఫ్ అనుకున్న దాని కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. సంతోషంగానే కాదు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.
సాధారణంగా మెదడులో ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా అనే నాలుగు స్టేట్స్ ఉంటాయి. నిమిషానికి మెదడులో 7 నుంచి 14 ‘ఎలక్ట్రోపాత్ వేవ్’లు ఉన్నప్పుడు దాన్ని ఆల్ఫా స్టేట్ అంటారు. 14 కంటే ఎక్కువ ఉంటే బీటా స్టేట్ అంటారు. 4 నుంచి 7 మధ్యలో ఉంటే.. థీటా స్టేట్ అని, 4 కన్నా తక్కువ ఉంటే డెల్టా స్టేట్ అని అంటారు. ఆల్ఫాస్టేట్ లో మనిషికి భావోద్వేగాలు ఉండవు. ఏ విషయాన్నయినా మెదడు సక్రమంగా తీసుకోగలుగుతుంది. మంచి ఆలోచనలు చేయగలుగుతుంది. మంచి పనితీరును ప్రదర్శించగలుగుతుంది. అయితే బీటా స్టేట్‌లో ఉన్నప్పుడే అసలు సమస్య. భావోద్వేగాలు ఎక్కువగా ఉండేది కూడా ఈ స్టేట్‌లోనే. ఇక థీటా, డెల్టాలను స్లీపింగ్ స్టేట్స్ అంటారు. అంటే ఈ స్థితిలో మెదడు అస్సలు పని చేయదన్నమాట. అయితే కొన్ని అలవాట్ల ద్వారా మెదడు ఆల్ఫా స్టేట్ కి తెచ్చుకోవచ్చు అవేంటంటే...
పాజిటివ్ యాటిట్యూడ్: పరిస్థితులను బట్టి సానుకూల ధోరణితో వ్యవహరించటం.. మన చేతుల్లో లేనివాటిని నిజాయతీగా అంగీకరించటం అలవాటు చేసుకోవాలి.
యోగా, ధ్యానం: వీటితో డిప్రెషన్, రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. మనసును లగ్నం చేసి, శ్వాస గట్టిగా తీసుకునే ప్రాణాయామం వంటి పద్ధతులతో మెదడుకు ప్రశాంతత చేకూరుతుంది.
కంటి నిండా నిద్ర: ఇది మూడ్‌ను, ఉత్సాహాన్ని, ఏకాగ్రతను మెరుగు పరుస్తూ ఒత్తిడి తగ్గటానికి తోడ్పడుతుంది.
రోజూ వ్యాయామం: వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టటానికి, కాన్ఫిడెన్స్ పెరగడానికి తోడ్పడుతుంది.
రిలేషన్ షిప్స్: కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు కలిగుండటం, మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా ఆత్మ స్థైర్యం వస్తుంది.
కాఫీ, చాక్లెట్లు: కాఫీ, చాక్లెట్ల వంటి వాటిల్లోని కెఫిన్ ఆందోళన పెరిగేలా చేస్తుంది. వీటిని అతిగా తీసుకోకపోవటం మంచిది.
ఆహారం: కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఆహారంలో తీసుకుంటే... శరీరం ఉల్లాసంగా ఉంటూ, మెదడు కూడా పాజిటివ్ గా ఉంటుంది.