Telugu Global
Health & Life Style

తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఇది తెలుసుకోండి!

భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకునే అలవాటుంటుంది చాలామందికి. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్ల చాలానే నష్టాలుంటాయంటున్నారు డాక్టర్లు.

తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఇది తెలుసుకోండి!
X

భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకునే అలవాటుంటుంది చాలామందికి. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్ల చాలానే నష్టాలుంటాయంటున్నారు డాక్టర్లు. తిన్న వెంటనే ఎందుకు పడుకోకూడదంటే.

తిన్న వెంటనే మగతగా అనిపించడాన్ని ‘ఫుడ్ కోమా’ అంటారు. తిన్న తర్వాత పడుకోవడాన్ని కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేస్తే కొంతకాలానికి అదొక అలవాటుగా మారుతుందట. దీనివల్ల శరీరంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

భోజనం చేసిన తర్వాత నిద్ర పోవడం వల్ల ముందుగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్నది సరిగ్గా అరగకపోగా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. క్రమంగా ఇది ఒబెసిటీ, డయాబెటిస్‌కు దారి తీయొచ్చు.

తిన్న వెంటనే నిద్రించడం వల్ల రక్త ప్రసరణలో కూడా మార్పులొస్తాయి. దీనివల్ల రక్తపోటు, గుండె సమస్యలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తిన్నవెంటనే పడుకోవడం ద్వారా గ్యాస్ పైకి రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఇది గుండె మంటకు దారి తీస్తుంది.

మధ్యాహ్నం వేళల్లో నిద్ర పోవడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది. తద్వారా రాత్రిపూట నిద్ర లేట్‌గా పడుతుంది. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీయొచ్చు.

ఇలా చేస్తే సరి

తిన్న వెంటనే నిద్ర రాకుండా ఉండేందుకు మధ్యాహ్నం టైంలో లైట్‌గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. నాన్‌వెజ్, ఫ్రైడ్ ఫుడ్స్‌ను తగ్గించాలి. తేలిగ్గా అరిగే ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకుంటే మగత తగ్గుతుంది.

తిన్న తర్వాత నిద్రపోయే అలవాటున్నవాళ్లు భోజనంలో పాల పదార్థాలు తీసుకోకూడదు. పెరుగు, పనీర్, చీజ్ వంటివి తీసుకుంటే మగత మరింత పెరుగుతుంది. వాటిలో ఉండే ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రేరేపిస్తుంది.

రాత్రి పూట ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే పగటిపూట నిద్ర తగ్గుతుంది. అలాగే తిన్న తర్వాత కనీసం రెండు గంటలు గ్యాప్ ఇచ్చి పడుకుంటే కొంతవరకూ మంచిది.

First Published:  19 July 2024 9:00 AM IST
Next Story