Telugu Global
Health & Life Style

మీరు ఎప్పుడు యవ్వనంగా ఉండాలా అనుకుంటున్నారా..అయితే ఈ ఆహారం తింటే చాలు

ప్రతి ఒక్కరు వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మెరుపు తగ్గుతుంది. నెమ్మదిగా కళ తప్పుతుంది. వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేకపోయినా, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ముసలితాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

మీరు ఎప్పుడు యవ్వనంగా ఉండాలా అనుకుంటున్నారా..అయితే ఈ ఆహారం తింటే చాలు
X

సమాజంలో ప్రతి ఒక్కరు యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు. దాని కోసం ప్రత్యేక వ్యాయామం చేస్తారు. వివిధ రకాల ఫుడ్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ స్కిన్ గ్లో తగ్గుతుంది. నెమ్మదిగా కళ తప్పుతుంది. కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వృద్ధాప్యాన్ని తగ్గించుకోనే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. నిర్దిష్ట పోషకాలతో కూడిన ఫుడ్స్ ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడటంతో పాటు, కొల్లాజెన్‌ ఉత్పత్తి ని పెంచుతాయి. ఫలితంగా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

తాజా ఆకుకూరలు

తాజా ఆకుకూరలు చర్మం మెరుపును అందిస్తాయి. తోటకూర, బచ్చలికూర, పాలకూరలో ఫోలేట్‌ తో పాటు విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు సెల్ రిపేర్, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. . దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ ఎ వంటి అవసరమైనన్నీ పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా మధుమేహం వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.చర్మానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి.

పండ్లు – కూరగాయలు:

ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యంగ్ కనిపించాలంటే మీరు తినే పండ్లు, కాయకూరలు చేర్చుకోండి. అన్ని రకాలు తినడం వల్ల అన్ని రకాల పోషకాలు అందుతాయి. మీ శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి.

డ్రై ఫ్రూట్స్

మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కూడా సహాయ పడతాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్, శ్వాస కోశ సమస్యలు, ఇన్ ఫెక్షన్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. చర్మ ప్రకాశవంతంగా మారుతుంది.

బెర్రీస్

బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతకమైన గుండె జబ్బులను, క్యాన్సర్ లను తగ్గించడానికి సహాయపడతాయి. వయసును కూడా తగ్గిస్తాయి.

పసుపు

పసుపులో యాంటీ ఏజింగ్ మరియు చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి మరియు ఇది శతాబ్దాలుగా సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగించబడుతోంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని నెమ్మదిస్తుంది మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.


అవోకాడో

అవోకాడో మీ చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడే అత్యంత అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌లో ఒకటి. ఫైబర్, పొటాషియం మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులతో లోడ్ చేయబడి, ఇది వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లను తయారు చేయడానికి కూడా వాటిని ఉపయోగించవచ్చు!

First Published:  5 Oct 2024 7:28 PM IST
Next Story