Telugu Global
Health & Life Style

మొటిమలు లేని మెరిసే చర్మం కోసం ఇలా చెయ్యండి

యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్‌ సమస్య మొటిమలు. టీనేజ్ లోకి రాగానే ప్రారంభం అయ్యే ఈ సమస్యకు ఆడ, మగ తేడా లేదు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడతారు.

మొటిమలు లేని మెరిసే చర్మం కోసం ఇలా చెయ్యండి
X

యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్‌ సమస్య మొటిమలు. టీనేజ్ లోకి రాగానే ప్రారంభం అయ్యే ఈ సమస్యకు ఆడ, మగ తేడా లేదు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడతారు.

అలాంటి సమయాల్లో రకరకాల క్రీమ్స్, సోప్స్, ఫేస్‌వాష్‌లు మార్చే బదులు కొన్ని చిన్న చిన్న టిప్స్ బాగా పని చేస్తాయి. నిజానికి మొటిమలు వారి వారి శరీర తత్వాలను బట్టి రావటం, పోవటం అన్నది ఉంటుంది. అంతే కాక కాలుష్యం, నిద్రలేమి, జీవనశైలి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తుంది. దీని కోసం ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో 10 సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెట్టాలి లేదా.. ఓ ఐస్ క్యూబ్‌ని క్లాత్‌లో పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

మొటిమలకు ముఖ్య కారణం జిడ్డు.. దానికి పసుపు, నిమ్మరసం, శనగపిండి ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది.

ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, బియ్యం పిండి, పెరుగు మిశ్రమం, ఆపిల్, టమాట లేదా బొప్పాయి ఎలా మీకు సుళువుగా దొరికే ఫ్రూట్ ప్యాక్ లు బాగా పని చేస్తాయి. అయితే ప్యాక్ వేసుకున్న తరువాత 10 నిముషాలలో కడిగేయాలి. అలాగే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి వెల్లుల్లి అసలు పడదు.. అలాంటివారు ఎక్కడో చదివాము కదా అని వెల్లుల్లిని మొటిమల దగ్గర పెట్టకపోవడమే మంచిది.

వీటన్నింటితో పాటు ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్, వేపుళ్లు, చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ తగ్గించాలి. వీటికి బదులు నీటిని ఎక్కువగా తాగుతూ పోషకాహారం, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.వీటిన్నితో పాటు.. మొటిమల మీద అస్సులు చెయ్యి వెయ్యకుండా ఉంటే చాలు మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

First Published:  3 Sept 2023 6:00 AM IST
Next Story