Telugu Global
Health & Life Style

కొలెస్ట్రాల్ కంటే ప్రమాదమైన ట్రైగ్లిజరైడ్స్ గురించి తెలుసా?

రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే కొలెస్ట్రాల్ కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయి.

కొలెస్ట్రాల్ కంటే ప్రమాదమైన ట్రైగ్లిజరైడ్స్ గురించి తెలుసా?
X

కొలెస్ట్రాల్ కంటే ప్రమాదమైన ట్రైగ్లిజరైడ్స్ గురించి తెలుసా?

రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే కొలెస్ట్రాల్ కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయి. అవే ట్రైగ్లిజరైడ్స్. కొలెస్ట్రాల్‌లాగానే ఇవి కూడా కొవ్వులో భాగంగా ఉంటాయి. కానీ, ఇవి కొలెస్ట్రాల్ కంటే కూడా డేంజర్.

శరీరంలోని అవసరంలేని క్యాలరీలన్నీ ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మారిపోతాయి. ఇవి చెడు కొవ్వులకంటే ప్రమాదం. ఇవి ఇవి ఎక్కువగా ఉంటే గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ మెటబాలిజం వేగాన్ని మందగింపజేస్తాయి. అలాగే ఇవి రక్తనాళాల గోడలు దెబ్బతీయగలవు. అందుకే కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసినట్టుగానే ట్రైగ్లిజరైడ్స్‌ను కూడా అదుపులో ఉంచుకోవాలి.

అదనపు క్యాలరీలన్నీ ట్రైగ్లిజరైడ్స్‌గా మారతాయి. కాబట్టి శరీరంలో అదనపు క్యాలరీలు లేకుండా చూసుకోవాలి. అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్ల జోలికి వెళ్లకూడదు.

ప్యాకెట్లలో లభించే చిప్స్‌, నూడుల్స్‌, పిజ్జాలు, కేకులు, బిస్కట్ల వంటి వాటి వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరిగే అవకాశం ఉంది. వీటికి బదులు రాగులు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చు.

కొవ్వు ఎక్కువగా ఉండే నూనె పదార్ధాల వల్ల కూడా ట్రైగ్లిజరైడ్ల ముప్పు పెరుగుతుంది. పంచదార, చాక్లె్ట్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇవి మరింత ప్రమాదంగా మారతాయి. అందుకే షుగర్ పేషెంట్లు ట్రైగ్లిజరైడ్లు ఎంత ఉన్నాయేమో టెస్ట్ చేయించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకుంటే ట్రైగ్లిజరైడ్లు అదుపులోకి వస్తాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్‌తో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు.

First Published:  30 Sept 2023 6:00 PM IST
Next Story