పర్‌ఫ్యూమ్స్‌తో పీసీఓఎస్ రావొచ్చు! జాగ్రత్తలు ఇలా..
సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేందుకు పర్‌ఫ్యూమ్ వాడకం కూడా ఒక కారణమని స్టడీస్ చెప్తున్నాయి.
సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేందుకు పర్‌ఫ్యూమ్ వాడకం కూడా ఒక కారణమని స్టడీస్ చెప్తున్నాయి.
పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) అనేది మహిళల్లో సాధారణంగా వచ్చే హార్మోన్ సమస్యల్లో ఒకటి. పది మంది స్త్రీలలో కనీసం ముగ్గురికి ఈ సమస్య ఉంటున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. అయితే పర్‌ఫ్యూమ్స్ ఎక్కువగా వాడడం వల్ల మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎక్కువ అవుతున్నట్టు ఇటీవల కొన్ని స్టడీల్లో తేలింది.
పర్‌ఫ్యూమ్స్‌లో ‘ట్రైక్లోసన్’ అనే క్లోరినేటెడ్ ఫ్రాగ్రెన్స్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మహిళల్లో ఈస్ట్రోజెనిక్, ఆండ్రోజెనిక్, యాంటీఆండ్రోజెనిక్ యాక్టివిటీస్‌కు నష్టం కలిగించి, థైరాయిడ్ పనితీరుని దెబ్బ తీస్తుంది. ట్రైక్లోసన్‌తో ఉండే నష్టాన్ని గుర్తించి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. స్నానానికి వాడే సబ్బుల్లో ట్రైక్లోసన్‌తో పాటు 18 ఇతర యాంటీమైక్రోబయల్ రసాయనాలను వాడటాన్ని నిషేధించింది. అయితే మనదేశంలో ట్రైక్లోసన్- ఉత్పత్తుల వాడకంపై ఎలాంటి నియంత్రణ లేదు. కాబట్టి పర్‌ఫ్యూమ్స్ వాడే ముందు అందులో ఎలాంటి రసాయనాలు ఉన్నాయో తెలుసుకుని వాడడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇకపోతే పర్‌ఫ్యూమ్స్ ఎక్కువగా వాడటం వల్ల ముక్కు, కళ్లు, గొంతు ఎలర్జీలు రావొచ్చు. కొన్నిరకాల శ్వాసకోస వ్యాధులకు కూడా పర్‌ఫ్యూమ్ లు కారణమవుతాయి. అలాగే పర్‌ఫ్యూమ్స్‌లో వాడే రసాయనాలను బట్టి కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా తలెత్తొచ్చు.
జాగ్రత్తలు ఇలా..
శరీరం నుంచి దుర్వాసన రాకుండా పర్‌ఫ్యూమ్ వాడడం మంచిదే అయినా దాన్ని వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సువాసన కోసం బాడీ స్ప్రే కంటే సెంటు వంటివి వాడడం మంచిది. పర్‌ఫ్యూమ్ రకాన్ని బట్టి రెండు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాలి. అది కూడా మణికట్టు మీద, భుజాల దగ్గర స్ప్రే చేసుకోవాలి. చర్మానికి అంటకుండా బట్టలపై వాడుకోదగ్గ పర్‌ఫ్యూమ్స్ ఎంచుకుంటే మంచిది.
పర్‌ఫ్యూమ్‌ను స్ప్రే చేసేటప్పుడు బాటిల్‌ను శరీరం నుంచి 5 నుంచి 7 అంగుళాల దూరం ఉంచాలి. అలాగే పర్‌ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ ఎంచుకునేటప్పుడు గాఢత తక్కువ ఉండే రకాన్ని ఎంచుకుంటే మంచిది.