Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో మలబద్ధకం తగ్గాలంటే..

సాధారణంగానే మలబద్ధకం చాలామందిని వేధించే సమస్యల్లో ఒకటి. అలాంటిది సమ్మర్‌‌లో ఉండే వేడి కారణంగా అది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే సమ్మర్‌‌లో మలబద్దకం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.

సమ్మర్‌‌లో మలబద్ధకం తగ్గాలంటే..
X

సాధారణంగానే మలబద్ధకం చాలామందిని వేధించే సమస్యల్లో ఒకటి. అలాంటిది సమ్మర్‌‌లో ఉండే వేడి కారణంగా అది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే సమ్మర్‌‌లో మలబద్దకం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అవేంటంటే..

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే సమ్మర్‌‌లో పట్టే చెమటల వల్ల శరీరం తరచూ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. తద్వారా అరుగుదల మందగిస్తుంది. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇది క్రమంగా మలబద్ధకానికి దారి తీస్తుంది.

సమ్మర్‌‌లో సరిగ్గా నీళ్లు తాగకపోవడం వల్ల మలబద్ధకం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి సమ్మర్ లో ప్రతి గంటకోసారి నీళ్లు తాగుతూ ఉండడం మర్చిపోకూడదు.

సమ్మర్‌‌లో నూనె పదార్థాలు అతిగా తింటే ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి ఈ సీజన్‌లో వాటిని వీలైనంత తగ్గించడం మంచిది. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఫైబర్ కోసం బ్రౌన్ రైస్, గోధుమలు, మిల్లెట్స్ వంటివి తీసుకోవచ్చు.

సమ్మర్‌‌లో నాన్‌వెజ్ ఎక్కువగా తినడం వల్ల కూడా మలబద్ధకం పెరుగుతుంది. మాంసాహారం అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే మాంసంలో ఉండే ప్రొటీన్స్ కరిగేందుకు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో మాంసాహారం కూడా తగ్గిస్తే మంచిది.

సమ్మర్‌‌లో మలబద్ధకం వేధించకూడదంటే ఆహారంలో వాటర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. వేగించిన పదార్థాలకు బదులు ఉడికించిన, పచ్చి ఆహారాలు తీసుకోవచ్చు.

ఇప్పటికే మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్నవాళ్లు దాన్ని నివారించడం కోసం డైట్‌లో ప్రొబయాటిక్ ఫుడ్స్ చేర్చుకోవాలి. పెరుగు, పులిసిన పదార్థాలు తింటుండాలి.

మలబద్ధకంతో బాధపడుతున్నవాళ్లు ప్రొటీన్ ఫుడ్ తగ్గించి పండ్లు ఎక్కువగా తీసుకుంటే సమస్య త్వరగా అదుపులోకి వస్తుంది. అరటి, జామ, దానిమ్మ, బొప్పాయి, బత్తాయివంటి పండ్లు ఆహారం సాఫీగా అరిగేలా చేస్తాయి.

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడం కోసం ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా పేగులు క్లీన్ అయ్యి సమస్య త్వరగా తగ్గుతుంది.

First Published:  8 May 2024 10:22 PM IST
Next Story