కాఫీ, టీ ఈ రెండిటిలో ఏది మంచిదంటే..
కాఫీ లేదా టీ ఈ రెండింటినీ రోజుకి రెండు కప్పులకు మించి తాగకూడదు. అసలు ఈ రెండింటికీ బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీల వంటివి అలవాటు చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటుంటుంది చాలామంది. అంతేకాదు అలసిపోయి ఇంటికి వచ్చినా, ఆఫీస్ బ్రేక్ టైంలో.. ఇలా రోజుకు రెండు మూడు సార్లైనా కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా కామన్. అయితే ఈ రెండింటిలో ఏది హెల్దీ ఆప్షన్? డాక్టర్లు ఏమంటున్నారు?
కాఫీ, టీ ఈ రెండింటిలో దేన్నైనా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. అయితే టీ కంటే కాఫీతోనే కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయనేది కొందరి వాదన. అదెలాగంటే..
కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జీ లభిస్తుందట. అలాగే మెదడులోని న్యూరాన్లు యాక్టివేట్ అయ్యి ఒత్తిడి, అలసట తగ్గినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, కాఫీతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. కాఫీలో బయోయాక్టివ్ కాంపౌండ్స్, పాలిఫినోలిక్ కంపౌండ్స్ వంటివి ఉంటాయి. ఇవి తలనొప్పి, ఒత్తిడి నుంచి ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇవ్వగలవు. అలాగని రోజులో రెండు సార్లకు మించి కాఫీ తాగడం కూడా అంత మంచిది కాదు.
కాఫీని మితంగా తీసుకుంటేనే దానివల్ల మేలు కలుగుతుంది. అతిగా తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కాఫీ తాగాలనుకున్నప్పుడు ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ వంటివి ఎంచుకోవాలి. మార్కెట్లో దొరికే క్యాపచ్చీనో, ల్యాటీ, కోల్డ్ కాఫీ వంటి వాటితో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.
కాఫీ అయినా టీ అయినా అతిగా తాగడం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయట. దాంతోపాటు జీర్ణసమస్యలు కూడా మొదలవుతాయి. అలాగే నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగడం కూడా అంత మంచిది కాదు. కనీసం రెండు గంటల గ్యాప్ అయినా ఇవ్వాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ లేదా టీ ఈ రెండింటినీ రోజుకి రెండు కప్పులకు మించి తాగకూడదు. అసలు ఈ రెండింటికీ బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీల వంటివి అలవాటు చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.