కొలెస్టాల్ లెవల్స్ తగ్గాలంటే.. వీటికి దూరంగా ఉండాలి
రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే రకరకాల గుండె సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయకపోతే కొన్ని సందర్బాల్లో అది ప్రమాదకరం కావొచ్చు. గుండె పోటు వంటి డేంజరస్ పరిస్థితులకు దారి తీయొచ్చు.
రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే రకరకాల గుండె సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయకపోతే కొన్ని సందర్బాల్లో అది ప్రమాదకరం కావొచ్చు. గుండె పోటు వంటి డేంజరస్ పరిస్థితులకు దారి తీయొచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు ఏయే ఫుడ్స్‌కు దూరంగా ఉండాలంటే..
కొలెస్ట్రాల్‌లో ‘ఎల్‌డిఎల్’, ‘హెచ్‌డిఎల్’ అనే 2 రకాలు ఉంటాయి. ఎల్‌డిఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్ అయితే హెచ్‌డిఎల్ అనేది శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్. శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే అది గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి శరీరంలోకి చెడు కొలెస్ట్రాల్ వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
చాలామంది ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్‌లో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 41 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు ఐస్‌క్రీమ్ తినే అలవాటుని తగ్గించుకోవాలి.
బిస్కెట్లు, కేక్స్‌లో కూడా ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల కొలెస్ట్రాల్‌తో పాటు జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
వేగించిన ఫుడ్స్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వేగించిన చికెన్, గుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. అందుకే పూర్తిగా నూనెలో వేగించిన పదార్ధాలను తగ్గించాలి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా పిజ్జా, బర్గర్, పాస్తా లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ శాతంలో ఉంటుంది. పిజ్జా, బర్గర్లు జంక్ ఫుడ్ కేటగిరిలో ముందు వరుసలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం తగ్గిస్తే మంచిది.
ఇక వీటితో పాటు బట్టర్, చీజ్, మయోనీస్ లాంటి పదార్థాల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరగడం, ఊపిరి ఆడకపోవడం, రక్తపోటు, ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు డైట్ మార్చి జాగ్రత్తలు తీసుకోవడం లేదా డాక్టర్‌ను కలవడం చేయాలి.