Telugu Global
Health & Life Style

పానీపూరీ అంటే ప్రాణం పెడతారా.. అయితే క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నట్టే..

తాజాగా కర్ణాటకలో జరిగిన తనిఖీల్లో పానీపూరీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పానీపూరీ అంటే ప్రాణం పెడతారా.. అయితే క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నట్టే..
X

పానీపూరీ చూడగానే ప్రాణం కొట్టేసుకుంటుందా.. తినేవారకు ఆగలేకపోతున్నారా.. ఆగండి ఆగండి .. ఇది మీకు సంబంధించిన విషయమే..

దేశవ్యాప్తంగా ఇప్పుడు పానీ పూరీ గురించి ఒకటే చర్చ జరుగుతోందన్నది తెలుసు కదా. ఇంతకు ముందు కూడా ఇలానే చర్చించుకున్నారు దానిలో వింతేముంది అనుకుంటున్నారా. అప్పుడంతా పరిసరాలు, పరిశుభ్రత ఆనే విషయం గురించి చర్చ కాబట్టి పర్లేదు కాస్త నీట్ గా చేసేవాడి దగ్గర తింటే సరి అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు విషయం అది కాదు. పానీ పూరీలో కేన్సర్ కారకాలున్న విషయం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా కర్ణాటకలో జరిగిన తనిఖీల్లో పానీపూరీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పానీ కలర్ రావడానికి వాడే పదార్ధంలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్‌లో వాడుతున్న కృత్రిమ వర్ణద్రవ్యాలలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.

ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. పానీపూరీలో సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్ల ఉండే కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్‌ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్ మరియు కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసింది దీని తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పానీ పూరీలో క్యాన్సర్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని పరిశీలిస్తోంది.

First Published:  4 July 2024 3:35 AM GMT
Next Story