Telugu Global
Health & Life Style

మీ ఎముకలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!

రోజువారీ జీవితం యాక్టివ్‌గా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే ఎముకలు బలహీనపడుతున్నాయి.

మీ ఎముకలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!
X

మీ ఎముకలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!

రోజువారీ జీవితం యాక్టివ్‌గా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే ఎముకలు బలహీనపడుతున్నాయి. అయితే శరీరంలో ఎముకలు వీక్‌గా ఉన్నాయని కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అదెలాగంటే..

ఎముకలు గుల్లబారితే వెంటనే విరిగిపోతుంటాయి. ఎప్పుడైనా గాయాలు అయినప్పుడు వెంటనే ఎముకలు విరగడాన్ని గమనిస్తే.. మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అంతేకాదు విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎక్కువ సమయం పడుతున్నా.. మీ ఎముకలు వీక్‌గా ఉన్నట్టు లెక్క.

ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం కూడా బలహీనమైన ఎముకలు, కీళ్లకు సంకేతాలు కావొచ్చు. ఎముకల సాంద్రత తగ్గినప్పుడు అవి బరువుని తట్టుకోలేవు. ఫలితంగా నిలబడడం, నడవడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి లక్షణాన్ని గమనించినట్టయితే వెంటనే డాక్టర్‌‌ను కలవడం మంచిది.

దేన్నైనా పట్టుకున్నప్పుడు పట్టు తప్పి కిందకు జారిపోతుంటే ఎముకల్లో పటుత్వం లేనట్టు అర్థం చేసుకోవాలి. అలాగే గోళ్లు తరచూ విరిగిపోతున్నా- ఎముకలలో బలం తగ్గినట్టే.

ఇలాంటి లక్షణాల్లో ఏది కనిపించినా మీ శరీరంలో కాల్షియం లోపం లేదా విటమిన్–డి లోపం ఉన్నట్టు అనుమానించాలి. ఎముకలు వీక్‌గా ఉన్నప్పుడు వాటిపై అదనపు భారం వేయడం ద్వారా అవి మరింత త్వరగా అరిగిపోయే ప్రమాదముంది. కాబట్టి లక్షణాలు ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా ఆర్ధోపెడిక్ డాక్టర్‌‌ను కలిసి తగిన వైద్యం చేయించుకోవాలి.

ఎముకల పటుత్వం కోసం కాల్షియం ఉన్న ఆహారాలను ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు, పాల పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్–డి కోసం ఉదయపు ఎండ తగిలేలా చూసుకోవాలి. తగిన పోషకాహారం తీసుకుంటూ.. రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

First Published:  26 Aug 2023 7:46 AM IST
Next Story