ఈ ఏడాది జొమాటో ఆర్డర్లో బిర్యానీ టాప్
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది.
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది. ఇందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పబ్లిక్ ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ లో బిర్యానీదే నెంబర్ వన్ ప్లేస్ అని జొమాటో పేర్కొన్నాది. 2024లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో 5,84,46,908 పిజ్జా ఆర్డర్లు వచ్చాయట.ఇక, రైల్వే టికెటింగ్ పోర్టల్ ఐఆర్ సీటీసీతోనూ జొమాటోకు భాగస్వామ్యం ఉంది. జొమాటో నిర్దేశిత రైల్వే స్టేషన్ల నుంచి, రైలు ప్రయాణికులకు వారు కోరుకున్న ఆహారాన్ని సరఫరా చేస్తుంటుంది.
ఓసారి ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ 120 మంచూరియా కాంబోలు ఆర్డర్ చేశాడని జొమాటో తన నివేదికలో వెల్లడించింది. అయితే అవన్నీ అతడి ఒక్కడి కోసమే కాదట... ఆ కంపార్ట్ మెంట్ లో ఉన్న అందరి కోసం ఆర్డర్ చేశాడని వివరించింది. ఇక, తన నివేదికలో మరికొన్ని ఆసక్తికర అంశాలను కూడా జొమాటో పంచుకుంది. ఢిల్లీకి చెందిన ఓ ఆహార ప్రియుడు ఈ ఏడాది 1,377 రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకున్నాడని తెలిపింది.