Telugu Global
Health & Life Style

బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లు

బరువు తగ్గాలనుకునే చాలామంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే లేదా తగ్గిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తోనే బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లు
X

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సరిపడా శక్తి ఉండాలి. దానికోసం రోజూ పొద్దున్నే సరైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకోవాలి. అన్నిరకాల పోషకాలతో పాటు అలాగే ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటే త్వరగా బరువు తగ్గొ్చ్చు. బరువు తగ్గాలనుకునే చాలామంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే లేదా తగ్గిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తోనే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. అదెలాగంటే..

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఆకలి మందగిస్తుంది. అలాగే శరీరంలో ప్రొటీన్స్‌ని జీర్ణం చేసుకునేందుకు అయ్యే క్యాలరీల ఖర్చు కూడా ఎక్కువే. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు కొవ్వులు, కార్బోహైడ్రేట్స్‌తో పోలిస్తే ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి.

ఉదయాన్నే గుడ్డుతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది కోడిగుడ్లను ఇతర కాయగూరలతో కలిపి వండుకోవడం ద్వారా అన్నిరకాల విటమిన్లు, పోషకాలు కూడా పొందేలా చూసుకోవచ్చు.

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బీన్స్‌ కూడా బెస్ట్ ఆప్షన్. బీన్స్‌లో పీచుపదార్థాలతో పాటు ప్రొటీన్స్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్స్‌ త్వరగా శరీరంలో కలిసిపోతాయి. అంతేకాదు.. బీన్స్‌తో పొట్ట దగ్గర ఉండే కొవ్వుని ఈజీగా కరిగించొచ్చు.

ఉదయాన్నే పుచ్చకాయ తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పుచ్చకాయను పొద్దున్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొవ్వు నిల్వలు తక్కువగా పేరుకుంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

ఇక వీటితో పాటు అరటిపండ్లు, పీనట్ బటర్, ఆల్మండ్ బటర్, యాపిల్స్, అవకాడో, ద్రాక్ష, బెర్రీస్, చిలగడ దుంప, బ్రొకలీ, పాలకూర లాంటివి కూడా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు బెస్ట్ ఆప్షన్స్. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో అల్లం, మిరియాలు, వాల్‌నట్స్, దాల్చినచెక్క, అవిసె గింజలు, కొబ్బరినూనె.. లాంటివి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

First Published:  16 Sept 2022 8:45 AM IST
Next Story