Telugu Global
Health & Life Style

చలికాలంలో వాకింగ్ ఇలా చేయండి

శీతాకాలంలో నడవడం అనేది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రోత్సహిస్తుంది, దీనితో ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.

చలికాలంలో వాకింగ్ ఇలా చేయండి
X

ఉదయాలు నడవడం అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. మార్నింగ్ వాక్ వల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, బరువు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలోనూ సహకరిస్తుంది.


రోజూ 30 నిమిషాల పాటు నడవడం ద్వారా పెరుగుతున్న బరువును నియంత్రించుకోవచ్చు. నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. శీతాకాలంలో నడవడం అనేది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రోత్సహిస్తుంది, దీనితో ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చలికాలంలో క్రమం తప్పకుండా నడవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది, జలుబు, ఫ్లూ, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంసూర్యరశ్మి తగ్గుతుంది, ఇది విటమిన్ డి స్థాయిలను తగ్గిస్తుంది. శీతాకాలంలో పగటిపూట ఆరుబయట నడవడం విటమిన్ డి ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.



అయితే చలికాలంలో నడవడం మంచిదే కానీ చల్లని వాతావరణం ఎన్నో సమస్యలని తీసుకొస్తుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ ఉదయపు నడకను కొనసాగించవచ్చు.

నడక కోసం బయటకు వెళ్లేటప్పుడు సాక్స్‌లతో బూట్లు ధరించండి. తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు పార్క్ లేదా మైదానాన్నిమాత్రమే ఎంచుకోండి. ఈ కాలంలో రోడ్డుపై నడవడం మానుకోండి. ఎందుకంటే పొగమంచు కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.


నడక పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోటానికి గోరువెచ్చని నీరు త్రాగండి. నెమ్మదిగా నడకను ప్రారంభించి, నెమ్మదిగానే ముగించండి. ఎక్కువ ఆయాసపడకండి.

అలాగే వేకువఝామున వాకింగ్ కు బయలుదేరిపోకుండా సూర్యోదయం తరువాత అంటేఉదయం 7 గంటల తర్వాత మాత్రమే నడకకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకాంతిలో నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల చల్లని గాలి నుండి మిమ్మల్ని రక్షించుకోవడంతోపాటు తాజా అనుభూతిని పొందవచ్చు. వయసులో పెద్దవారు మాత్రం ఎండగా ఉన్నప్పుడు అంటే ఉదయం 11 తర్వాత మాత్రమే నడకకు వెళ్లడం మంచిది. ఇక ఆస్తమా ఉన్నవారు ఉదయం పూట అసలు బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం.

First Published:  8 Jan 2024 3:45 AM GMT
Next Story