Telugu Global
Health & Life Style

ఆ తీపితోనూ ఆరోగ్యానికి చేదే!

ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీట్ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారికి.. క్యాన్సర్ వచ్చే అవకాశం 95% ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఆ తీపితోనూ ఆరోగ్యానికి చేదే!
X

మధుమేహం ఉన్నవారు, అధిక బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు బదులుగా.. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకుంటూ ఉంటారు. షుగర్‌ రాకుండా జాగ్రత్తపడేవారు, వారి డైట్‌లో చక్కెరను తీసుకోవడం మానేసి.. వీటి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కృత్రిమ తీపి పదార్థాలను తినడం వల్ల చక్కెర మన శరీరంలోకి చేరదు. అలాగే కేలరీలూ రావు. అందువల్ల షుగర్‌ పెరగదు. ఈ ఉద్దేశంతోనే సింథటిక్‌ పదార్థాలను వాడి స్వీటెనర్‌ లను తయారు చేస్తారు. కృత్రిమంగా తీపి రుచిని తెప్పిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పంచదారకంటే ఎక్కువ అతిగా ఉండే ఈ కృత్రిమ స్వీటనర్లు తియ్యగా ఉంటాయి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను మరింత తినాలనిపించేలా ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో అతి బరువు తగ్గడం కాదు పెరుగుతుంది. అలాగే మనం ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్‌ తీసుకున్నప్పుడు.. మనం తీపి పదార్థం తింటున్నామని, మెదడుకు సిగ్నల్స్‌ వెళ్తాయి. వెంటనే మన మెదడు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి సూచనలు ఇస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకుంటే.. మన ప్యాంక్రియా నుంచి ఇన్సిలన్‌ విడుదల అవుతుంది. ఇది రక్తంలో ఇన్సులన్‌ స్థాయిలను పెంచుతుంది.

ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీట్ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారికి.. క్యాన్సర్ వచ్చే అవకాశం 95% ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే కృత్రిమ స్వీటనర్లు మన పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు గ్లూకోజ్‌ని ఎక్కువగా తీసుకోలేనట్లుగా మార్చేస్తాయి. అందువల్ల గ్లూకోజ్‌ ను అంగీకరించలేకపోవటం, ఊబకాయం లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్‌ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి.

నిజానికి కృత్రిమ తీపి పదార్థాలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలను ఎప్పటికీ భర్తీ చేయలేవు. అందుకే తక్కువ క్యాలరీలు ఉన్న తీపి పదార్థాల కోసం సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడమే మంచిదంటున్నారు నిపుణులు.

First Published:  19 Jun 2024 12:30 AM GMT
Next Story