Telugu Global
Health & Life Style

యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు

బకాయిల చెల్లింపునకు గడువు కోరిన ప్రభుత్వం

యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు
X

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈవో శివశంకర్‌ ప్రకటించారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ లోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులతో తాము చర్చలు జరుపుతున్నామని.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యథావిధిగా సేవలు కొనసాగించాలన్న తమ విజ్ఞప్తిని ఆస్పత్రులు అంగీకరించాయని తెలిపారు. శుక్రవారం యథావిధిగా వైద్య సేవలు కొనసాగిస్తామని నెట్‌ వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పెండింగ్‌లో రూ.1,130 కోట్ల బకాయిలు చెల్లించాలని కోరారు. తాము మరోసారి సమ్మె పిలుపునిచ్చే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. గతంలో ఉన్న బకాయిలను చెల్లించామని, 2013 నుంచి పెండింగ్‌ లో ఉన్న ప్యాకేజీల రేట్లను 22 శాతం పెంచామని సీఈవో గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బకాయిలు చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలని, అప్పటి వరకు పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని సీఈవో విజ్ఞప్తి చేశారు. అందుకు నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం నుంచి తలపెట్టిన ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ కు బ్రేక్‌ ఇచ్చినట్టు అయ్యింది.

First Published:  9 Jan 2025 8:27 PM IST
Next Story