Telugu Global
Health & Life Style

కళ్ళు మంటలు పెడుతున్నాయా .. ఇలా చేయండి

కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, పోష‌కాల లోపం, డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, పొల్యూషన్ .. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి.

కళ్ళు మంటలు పెడుతున్నాయా .. ఇలా చేయండి
X

కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, పోష‌కాల లోపం, డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, పొల్యూషన్ .. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి. ఇది ఎక్కువైతే తలనొప్పి, కళ్లనుంచి నీరుకారడం వంటి సమస్యలు మొదలవుతాయి. మరీ ఎక్కువైతే కంటి పై వత్తిడి పడి చూపు తగ్గే ప్రమాదం కూడా ఉంది. కళ్ల మంట నుంచి ఉపశమనం పొందడానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవేంటంటే ..

కంప్యూటర్స్, ఫోన్స్ మీరు ఏవి యూజ్ చేస్తున్నారో వాటి స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించండి. రూమ్‌లో వెలుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఆ వెలుతురు కూడా మీ కళ్ళపై ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం మంచిది. అదే విధంగా, పని చేస్తున్నప్పుడు బ్రేక్ తీసుకోవడం మంచిది. డిజిటల్ స్క్రీన్స్, బుక్స్ ఇలా ఏవైనా సరే కాస్తా బ్రేక్ తీసుకోవడం వల్ల అదే పనిగా కాకుండా కాస్తా కళ్ళకి విరామం ఇచ్చినట్లు ఉంటుంది. అలాగే కంప్యూటర్ల ముందు గంటల తరబడి పని చేసే వాళ్ళు రీడింగ్‌ గ్లాసెస్‌ వంటివి వాడటం, బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోవటం మంచిది.

తరచూ కళ్ళు మండుతుంటే కీరదోస ముక్కల్ని రోజూ కాసేపు కళ్లపై పెట్టుకోవాలి. కీరా లేదా వాడేసిన గ్రీన్ టీ బ్యాగు, రోజ్‌వాటర్‌లో ముంచిన దూదిని కూడా వాడుకోవచ్చు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేడిని తగ్గించి కళ్లను చల్లబరుస్తాయి. అలాగే క‌ళ్ళ మంట‌ను త‌గ్గించ‌డంలో బంగాళ‌దుంప కూడా అద్భుతంగా పని చేస్తుంది.


బంగాళ‌దుంపని గుండ్రంగా క‌ట్ చేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత వాటిని తీసుకుని క‌ళ్ళ‌పై పెట్టుకుంటే క‌ళ్ళ మంట‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మధ్యమధ్యలో కళ్ళు కడగడం కూడా మంచి రెమిడీలా పనిచేస్తుంది. దూదిని పాలలో ముంచి మూసిఉన్న కంటిపై పెట్టుకోవటం కూడా ఫలితాన్ని ఇస్తుంది.

అలాగే ఇవన్నీ చేస్తూ కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి గ్యాడ్జెట్స్‌ను వాడితే ప్రయోజనం ఉండదు.. కాసేపు అన్నింటినీ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి.

First Published:  26 Dec 2023 10:00 AM IST
Next Story