Telugu Global
Health & Life Style

షుగర్‌ ఉందా.. తస్మాత్‌ జాగ్రత్త!

ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరికి గుండె జబ్బు ముప్పు

షుగర్‌ ఉందా.. తస్మాత్‌ జాగ్రత్త!
X

షుగర్‌ ఉందా.. తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రతి నలుగురు షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో ఒకరికి గుండె జబ్బు ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. సుదీర్ఘకాలం డయాబెటిస్‌ తో బాధ పడుతున్నవారు.. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ లో ఉండని వారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. షుగర్‌ లెవల్స్‌, కొలెస్ట్రాల్‌ పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోవడంతో గుండె జబ్బు ముప్పు పెరుగుతుంది. షుగర్‌ కు తోడు లిక్కర్‌, స్మోకింగ్‌ లాంటి అలవాట్లు ఉంటే సమస్య తీవ్రత ఇంకా పెరుగుతుంది. అలాంటి వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డయాబెటిస్‌ బారిన పడిన వాళ్లు క్రమం తప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలి. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ లో ఉంచుకోవడమే కాదు.. బీపీని కూడా కంట్రోల్‌ చేసుకోవాలి. బ్లడ్‌ లో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుకొని మంచి కొలెస్ట్రాల్‌ పెంచుకోవాలి. లిక్కర్‌, స్మోకింగ్‌ అలవాట్లు పూర్తిగా మానుకుంటే మంచిది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజు ఎక్సర్‌ సైజ్‌ చేస్తే గుండెను పరిరక్షించుకోవచ్చని చెప్తున్నారు.

First Published:  6 Oct 2024 7:46 AM GMT
Next Story