Telugu Global
Health & Life Style

యాంగ్జయిటీ వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!

ఈ రోజుల్లో యువతను ఎక్కువగా కుంగదీస్తున్న సమస్య యాంగ్జయిటీ. కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల వరకూ చాలామంది యువత ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

యాంగ్జయిటీ వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!
X

ఈ రోజుల్లో యువతను ఎక్కువగా కుంగదీస్తున్న సమస్య యాంగ్జయిటీ. కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల వరకూ చాలామంది యువత ఈ సమస్యతో బాధ పడుతున్నారు. అసలు యాంగ్జయిటీ ఎలా ఉంటుంది? దీన్నుంచి బయటపడేదెలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పష్టంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వెంటవెంటనే ఆలోచనలు మార్చుకోవడం, చిన్న విషయాలకే కంగారు పడడం, భయపడడం వంటివి యాంగ్జయిటీ లక్షణాలు. దీన్ని ఎదుర్కొంటున్నవాళ్లు తమకు యాంగ్టయిటీ వేధిస్తుందని గుర్తించలేకపోతారు. తద్వారా మానసికంగా బలహీనపడతారు, కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, నిరాశ పెరిగిపోతుంది. అందుకే ఒత్తిడి, భయం, టెన్షన్ వంటి ఫీలింగ్స్ వెంటాడుతున్నవాళ్లు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. వీలైనంత త్వరగా సమస్యకు చెక్ పెట్టాలి. అదెలాగంటే..

యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నవాళ్లు ముందుగా ఖాళీగా ఉండే సమయాన్ని తగ్గించుకోవాలి. వీలైనంత వరకూ బిజిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం తప్పక చేయాలి. వ్యాయామం వల్ల బ్రెయిన్‌లో ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదలయ్యి తెలియని యాక్టివ్‌నెస్ వస్తుంది. తద్వారా యాంగ్జయిటీ తగ్గి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నవాళ్లకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఈ సమయంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. అలా కొత్త అలవాట్లు చేసుకోవడం, ఉద్యోగం మానుకోవడం, బంధాలను దూరం పెట్టడం వంటివి చేస్తుంటారు. కాబట్టి ఒంటరి ఆలోచనలకు చెక్ పెట్టాలి. వీలైనంత వరకూ పాజిటివ్ వ్యక్తులతో ఎక్కువగా టైం గడపాలి. ఆటలు, ప్రయాణాలు, మ్యూజిక్ వంటివి మరింత హెల్త్ చేస్తాయి.

యాంగ్జయిటీ వేధిస్తుందని అర్థమైనవాళ్లు ఆ విషయాన్ని ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో పంచుకుంటే మంచిది. తద్వారా మీ చుట్టూ పాజిటివ్‌ వాతావరణం ఉండేలా వాళ్లు సాయం చేస్తారు. అలాగే సమస్య ఎక్కువగా ఉందనుకున్నప్పుడు సైకాలజిస్టు సాయం తీసుకోవచ్చు.

ఎక్కువకాలం పాటు యాంగ్జయిటీని ఎదుర్కోవడం వల్ల డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి యాంగ్జయిటీని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే ఒత్తిడి, కంగారు వంటి లక్షణాలు తగ్గేందుకు తాజా ఆహారం, ప్రాణాయామం, ధ్యానం వంటివి కూడా సాయం చేస్తాయి. కావాలనుకుంటే వాటిని కూడా ప్రయత్నించొచ్చు.

First Published:  5 May 2024 10:50 AM
Next Story