బరువు తగ్గించే సెవెన్ సెకండ్స్ కాఫీ! వైరలవుతున్న ట్రెండ్!
ప్రస్తుతం అధిక బరువు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అందుకే బరువు తగ్గించేందుకు రోజుకో కొత్తరకమైన విధానం అందుబాటులోకి వస్తుంది. అందులో భాగంగానే ‘సెవెన్ సెకండ్స్ కాఫీ’ అనేది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుతం అధిక బరువు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అందుకే బరువు తగ్గించేందుకు రోజుకో కొత్తరకమైన విధానం అందుబాటులోకి వస్తుంది. అందులో భాగంగానే ‘సెవెన్ సెకండ్స్ కాఫీ’ అనేది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఇదెలా ఉంటుందంటే..
బరువు తగ్గించే డైట్స్‌లో రకరకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా కొత్తరకమైన ట్రెండ్ వైరల్ అవుతుంది. అదే సెవెన్ సెకండ్స్ కాఫీ. అంటే ఏడు సెకన్లలో చేసే కాఫీ అని అర్థం. కాఫీ పొడి, నిమ్మరసం, దాల్చిన చెక్కతో చేసే ఈ కాఫీ ఈజీగా బరువుని కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవాళ్లు ముందుగా ఆకలిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆకలి వేయకపోతే ఆటోమేటిక్‌గా క్యాలరీలు తగ్గుతాయి. తద్వారా క్రమంగా బరువు తగ్గొచ్చు. అయితే ఆకలిని కంట్రోల్ చేయడం కోసం సెవెన్ సెకండ్స్ కాఫీ బాగా పనిచేస్తుందట. కాఫీ డికాక్షన్‌లో కొద్దిగా నిమ్మరసం, దాల్చిన చెక్క కలిపితే అదే సెవన్ సెకండ్స్ కాఫీ. ఇది శరీరంలో డోపమైన్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇవి మెదడుకి రీఫ్రెష్‌మెంట్ ఇవ్వడంతోపాటు ఆకలి ఫీలింగ్‌ను తగ్గిస్తాయి. ఇలా ఈ కాఫీ.. బరువు తగ్గడంలో సాయపడుతుంది. ప్రస్తుతం ఈ కాఫీ ట్రెండ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇకపోతే ఈ కాఫీని అదేపనిగా తాగుతూ పూర్తిగా ఆకలిని చంపుకోవడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాఫీని రోజుకోసారి మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం టైంలో స్నాక్స్ తర్వాత ఈ కాఫీ తీసుకుంటే రాత్రిపూట ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే బరువుతోపాటు ఇతర సమస్యలున్నవాళ్లు డాక్టర్ల సలహామేరకు మాత్రమే డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఆకలిని పూర్తిగా కంట్రోల్ చేసుకుని పస్తులు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు.