Telugu Global
Editor's Choice

నాడు దేశానికి దిక్సూచి.. నేడు దివాళా

పదకొండు నెలల్లోనే గురుకులాల పరిస్థితి అగమ్యగోచరం

నాడు దేశానికి దిక్సూచి.. నేడు దివాళా
X

పదకొండు నెలల కిందట దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు నాణ్యమైన ఆంగ్ల విద్యను బోధించాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. 1000 వరకు గురుకులాలను పెంచింది. దేశంలోనే గురుకులాలను అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్దింది. తెలంగాణ గురుకులాలను దేశానికి రోల్‌ మోడల్‌గా తయారు చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అందులో చదువు చెప్పేలా, పిల్లలకు మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నది. అందులో చదివే పిల్లలు వాళ్లంతా వాళ్లే తమ జీవితాల్లో నిలదొక్కుకునేలా అద్బుతమైన ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయి.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా గురుకులాలను తీర్చిదిద్దారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు కాకుండా గురుకులాలకు పంపించారు. లక్షలాది మంది విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్య, భోజనాన్ని అందించింది. కానీ రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే గురుకులాల్లో చదివే విద్యార్థులు రోడ్లెక్కె, అక్కడ సరైన భోజనం లేక అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. గురుకులాలను మూసేసే కుట్రలో భాగంగానే వాటిని ఒక ప్లాన్‌ ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారని తెలుస్తోంది. మళ్లీ కార్పొరేట్‌ స్కూళ్లకు రేవంత్‌ రెడ్‌ కార్పెట్‌ పరిచేలా ఆయన అడుగులున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో , ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటుండటంతో వారి తల్లిదండ్రులు తమ పిల్లలు బతికి ఉంటే చాలు అనుకునే వాతావరణం ఉన్నది. దీంతో వాళ్లంతా మళ్లీ అప్పులు చేసి అయినా కార్పొరేట్‌ స్కూళ్లకు పంపిస్తారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు విద్య, భోజనంపై పెట్టే ఖర్చు భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని చూస్తున్నది.

గురుకులాల్లో పిల్లలను చదివించడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రుల సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆ మధ్య సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్‌ చేశారు. ఇది యాధృచ్ఛికంగా చేసింది కాదు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించిన అనేక పథకాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. వీటితోపాటు గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచితంగా నాణ్యమైన బోధన, భోజనం అందితే కార్పొరేట్‌ స్కూల్స్‌ ఎలా నడుస్తాయి అన్నది ఆయన హిడెన్‌ అజెండా. అందుకే కేసీఆర్‌ హయాంలో ప్రారంభమైన గురుకులాల స్థానంలో

అందుకే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యత ప్రభుత్వాలది. విద్యాశాఖ లేదా, ఛైల్డ్‌ ఫెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌ది. కానీ సీఎం రేవంత్‌ రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడానికి సిద్ధపడ్డారు. కొడంగల్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు రకరకాల మతాల వాళ్లుంటారు. పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు వాళ్లు శాస్త్రీయంగా సూచించిన నాన్‌ వెజ్‌ కూడా గత ప్రభుత్వం అందించింది. నాన్‌ వెజ్‌ దూరంగా ఉండే ధార్మిక సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టడంలో ఆత్యర్యం ఏమిటి? రాహుల్‌ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఈ దేశం లౌకిక దేశం అంటారు. ఇక్కడ వారి సీఎం ఏమో లౌకిక విలువలకు తూట్లు పొడిచేలా చర్యలు తీసుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షం మండిపడుతున్నది.

అలాగే మండలాలనికో ఇంటర్నేషన్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని రేవంత్‌ ప్రభుత్వం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అధికారంలో వచ్చాక అన్న విషయాల లాగనే ఇంటర్నేషన్‌ స్కూల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లుగా మారిపోయాయి. మండలానికి ఒకటి అన్నది నియోజకవర్గానికి ఒకటి అయ్యింది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు ఒకవైపు చేస్తూనే సమీకృత గురుకుల పాఠశాలలు పనులకు శంకుస్థాపనలు చేశారు. తొలి విడతలో 19 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటివరకు నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయని ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పింది. అంటే రానున్న రోజుల్లో అవన్నీ మూతపడుతాయని చెప్పకనే చెప్పింది. అయితే విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్న రేవంత్‌రెడ్డి గురుకులాల్లో ఏం జరుగుతుంతో తెలియకపోవడం విషాదం. ఎస్సీ గురుకులాల్లో ఎస్సీలే ఉండరు, ఎస్టీ గురుకులాల్లో ఎస్టీలే ఉండరు, బీసీ గురుకులాల్లో బీసీలు మాత్రమే ఉండరని, మైనారిటీల్లోనూ మైనారిటీలే ఉండరన్న సంగతి సీఎంకు తెలియదు. రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 పైగా మంది విద్యార్థులు చనిపోయారు. తాజాగా వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టకపోవడమే కాకుండా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించలేదు. దీంతో25 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ గిరిజన విద్యార్థిని శైలజ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి 11 నెలల కాలంలో 42 మంది గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్, పాముకాట్లు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.

First Published:  27 Nov 2024 2:10 PM IST
Next Story