Telugu Global
CRIME

బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో యువతికి ఉరిశిక్ష

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మ

బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో యువతికి ఉరిశిక్ష
X

బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో యువతి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష ఖరారు చేసింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ఈ ఘటన చోటుచేసుకోగా.. గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది.

కన్యాకుమారి జిల్లా రామవర్మంచిరకు చెందిన గ్రీష్మ అనే 24 ఏళ్ల యువతి, తన ప్రియుడు షరోన్ రాజ్‌కు ప్రాణాంతకమైన కలుపు సంహారక మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి హత్య చేసిన కేసులో నేరం 2022లో రుజువైంది. జస్టిస్ ఏఎం బషీర్ ఇది అరుదైన నేరంగా నిర్ధారించారు. నిందితురాలు ఆమె చిన్న వయస్సు , విద్యార్హత కారణంగా ఎటువంటి ఉపశమనానికి అర్హులు కాదని తీర్పు ఇచ్చారు. మహిళ చర్య సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిందిని నిందితులు ప్రేమ పవిత్రతను తుంగలో తొక్కారు. తీర్పు వినడానికి షరోన్ తల్లిదండ్రులను కోర్టు పిలిపించింది. వారు వాదనలు వింటూ విరుచుకుపడ్డారు.హత్య, కిడ్నాప్ మరియు సాక్ష్యాలను నాశనం చేయడంతో సహా ఆమెపై మోపబడిన అన్ని అభియోగాలలో గ్రీష్మా దోషి అని కోర్టు గతంలో నిర్ధారించింది.

First Published:  20 Jan 2025 1:24 PM IST
Next Story