Telugu Global
CRIME

వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్టు

వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మృతుడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్టు
X

ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనసూర్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళ బానోత్ అనసూర్య కారణమని ఎస్ఐ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు గుర్తించారు. గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు అనసూర్య పరిచయమైనట్లు తెలుస్తోంది.

వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లిచేసుకుందామని అనుకున్నారని.. ఆమె బ్యాగ్రౌండ్‌ను ఎస్ఐ చెక్ చేయగా ఆమెకు ఇంతకు ముందే వేరే వారితో పరిచయాలు ఉన్నాయని తెలిసి హరీశ్ పెళ్లి వద్దనుకోగా.. ప్రియురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో గన్‌తో కాల్చుకుని చనిపోయినట్లు సమాచారం ఉంది. తరచుగా ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకోని, పెళ్లి చేసుకోవాలని ఒత్తడి చేసింది. హరీశ్ అందుకు నిరాకరించారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ రివాల్వర్‌తో కాల్చుకోని చనిపోయాడని పోలీసులు తెలిపారు.

First Published:  15 Dec 2024 11:43 AM IST
Next Story