వాలంటైన్స్ డే రోజు అమానుషం.. యువతిపై యాసిడ్ దాడి
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి చేసిన గణేష్ అనే యువకుడు

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. గణేశ్ అనే యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు గణణేశ్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై హోం మంత్రి అనిత మండిపడ్డారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి.. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతోనూ మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరు తరలించడానికి ఏర్పాట్టు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు.