Telugu Global
CRIME

రేవంత్‌ ప్రభుత్వ దాష్టీకానికి ఇది మచ్చుతునక

లగచర్ల గిరిజన వృద్ధురాలి వీడియో షేర్‌ చేసిన కేటీఆర్‌

రేవంత్‌ ప్రభుత్వ దాష్టీకానికి ఇది మచ్చుతునక
X

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ దాష్టీకానికి ఇది మచ్చు తునక అని కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్లకు చెందిన గిరిజన వృద్ధురాలి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ''కళ్లుండీ చూడలేని.. చెవులుండీ వినలేని.. బధిరాంధక రేవంత్ ప్రభుత్వపు.. దాష్టీకానికి మచ్చుతునక ఇది!.. రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆ పేద గిరిజనుల భూముల మీద కన్నేసిండు రేవంత్.. మా భూములు గుంజుకోవద్దన్నందుకు పోలీసులే దొంగల్లెక్క అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారు.. గడ్డపారలతో వారి ఇండ్ల తలుపులు విరగ్గొట్టారు. ఇంట్లో ఉన్న బీరువాను కూడా వదలకుండా పగలగొట్టారు.. కళ్లు సరిగ్గా కనిపించని ఈ ముసలమ్మ చేతి కర్రను లాగి విసిరేశారు.. దొరికినవాళ్లను దొరికినట్టు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి, జైళ్లో వేశారు.. ప్రజా ప్రభుత్వం పేరున గద్దెనెక్కి ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ నిర్వాకమిది..'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లపై పడి పోలీసులు ఏ విధంగా దాడులు చేశారో ఆ వృద్ధురాలు వివరిస్తున్న వీడియో గుండెలు బరువెక్కించేదిగా ఉంది.

First Published:  15 Nov 2024 7:58 PM IST
Next Story