Telugu Global
CRIME

ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త సుమంత్‌రెడ్డిపై ప్రియుడితో కలిసి దాడి చేయించిన భార్య ఫ్లోరా మరియా.

ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
X

వరంగల్‌ నగరంలో ఇటీవల డాక్టర్‌పై హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే. ప్రియుడిపై మోజుతో భర్త (డాక్టర్‌)ను తుదముట్టించే పన్నాగంలో భాగంగా భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్‌ సుమంత్‌రెడ్డి వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.

వరంగల్ హంటర్‌రోడ్‌లోని వాసవీకాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్‌ సుమంత్‌రెడ్డికి 2016లో ఫోర్లా మరియాతో లవ్‌ మ్యారేజ్‌ అయ్యింది. తన బంధువుల విద్యా సంస్థలను చూసుకోవడానికి 2018లో సుమంత్‌రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మకారం మార్చారు. అక్కడ ఫోర్లా టీచర్‌గా, సుమంత్‌రెడ్డి పీహెంచ్‌సీలో కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా చేరారు. సంగారెడ్డిలో జిమ్‌కు వెళ్తున్న క్రమంలో ఫోర్లాకు ట్రైనర్‌ శామ్యూల్‌తో పరిచయం పెరిగి, వివాహేతర సంబంధానికి దారితీసింది.

విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో భార్యభర్తలు మధ్య గొడవలు జరిగి.. మళ్లీ వరంగల్‌కు మకాం మార్చారు. ఆమెకు 2019లో జగామన జిల్లా పెంబర్తి సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో అధ్యాపకురాలిగా జాబ్‌ వచ్చింది. తర్వాత ఆ కాలేజీని రంగశాయపేటకు మార్చారు. అయినా ఫోరా ప్రవర్తనలో మార్పు లేదు. భర్త లేని సమయంలో శామ్యూల్‌ను ఇంటికి పిలిచేది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. దాంతో సుమంత్‌రెడ్డిని అడ్డు తొలిగించుకోవాలని ఫ్లోరా, శామ్యూల్‌ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఫోర్లా రూ. లక్ష శామ్యూల్‌కు ఆన్‌లైన్‌లో పంపింది. ఇందులో రూ. 50 వేలను శామ్యూల్‌ .. సైబరాబాద్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన ఫ్రెండ్‌ రాజ్‌కుమార్‌కు ఇచ్చాడు. డాక్టర్‌ను చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. పన్నాగంలో భాగంగా ఈ నెల 20న రాత్రి వారిద్దరూ హెల్మట్‌ పెట్టుకుని బైక్‌పై వరంగల్‌ చేరకున్నారు.

కాజీపేటలో ప్రైవేట్‌ హాస్పిటల్‌ నడుపుతున్న సుమంత్‌రెడ్డి రాత్రి డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లిరోడ్డులో కారు వెనుకభాగంలో సుత్తితో కొట్టారు. సౌండ్‌ విన్న సుమంత్‌రెడ్డి కారును ఆపి బైటికి వచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతని తలపై బలంగా కొట్టారు. చనిపోయాడు అనుకొని పారిపోయారు. తీవ్ర రక్తస్రావమైన డాక్టర్‌ను స్థానికులు 108 లో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి ఉంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అతని పరిస్థితి అత్యంత విషమయంగా ఉండటంతో తిరిగి వరంగల్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తండ్రి సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మాడినిక వెళ్తున్న శామ్యూల్‌, రాజ్‌కుమార్‌, ఫ్లోరా మరియాలను గురువారం అరెస్టు చేశారు. హత్య వెనుక డాక్టర్‌ భార్యతో పాటు ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

First Published:  1 March 2025 10:11 AM IST
Next Story