ప్రియురాలిని చంపి..20 ముక్కలుగా నరికిన కసాయి ప్రియుడు
ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు. ఈ ఘటన భద్రాది జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో జరిగింది
BY Vamshi Kotas13 Nov 2024 3:08 PM IST

X
Vamshi Kotas Updated On: 13 Nov 2024 3:08 PM IST
భద్రాది కొత్తగుడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపిన ప్రియుడు వీరభద్రం గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కాగా గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని.. ఓ జంట దగ్గర నుండి స్వాతి- వీరభద్రం రూ. 16 లక్షలు తీసుకున్నారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని ఆ బాధితులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 16 లక్షల విషయంలో స్వాతి- వీరభద్రంకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. శరీర భాగలను గోనె సంచిలో వేసి పోలంలో పూడ్చిపెట్టాడు.
Next Story