Telugu Global
CRIME

అఫ్ఘాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 50 మంది మృతి

రెండు ఘటనల్లో 76 మందికి తీవ్ర గాయాలు

అఫ్ఘాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 50 మంది మృతి
X

అఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్నేయ అఫ్ఘానిస్థాన్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. బుధవారం సాయంత్రం కాబుల్‌-కాందహార్‌ను కలిపే హైవేపై ఓ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. మరోవైపు అదే రోడ్డుపై దక్షిణ భాగంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ రెండు ఘటనల్లో సుమారు 50 మంది మృతి చెందారు. 76 మందికి తీవ్ర గాయలయ్యాయి. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం బాధాకరం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఘాజ్నీ ప్రావిన్స్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరానలు ఘాజ్నీ ప్రావిన్స్‌ గవర్నర్‌ ప్రతినిధి హఫీజ్‌ ఒమర్‌ తాజాగా వెల్లడించారు.

First Published:  19 Dec 2024 1:46 PM IST
Next Story