బాలీవుట్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి
ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి..నటుడికి ఆరుచోట్ల గాయాల
BY Raju Asari16 Jan 2025 9:12 AM IST
X
Raju Asari Updated On: 16 Jan 2025 11:54 AM IST
బాలీవుట్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నది. సైఫ్, అతని కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకోవడానికి పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దాడిలో నటుడికి ఆరుచోట్ల గాయాలయ్యాయి.
Next Story