30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు
ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
BY Raju Asari23 Oct 2024 9:19 AM IST

X
Raju Asari Updated On: 23 Oct 2024 9:19 AM IST
వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
Next Story