భర్తను చంపి.. ముక్కలు ముక్కలుగా నరికి
కలకలం రేపిన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. చిక్కోటి తాలూకా ఉమారాణి గ్రామంలో గురువారం తెల్లవారుజామున భర్తను భార్య క్రూరంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా కోసి గ్రామ శివారులోని బావి దగ్గర పడేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉమారాణి గ్రామానికి చెందిన శ్రీమంత్ హిట్నల్, సావిత్రి హిట్నల్ భార్యభర్తలు. వారికి నలుగురు సంతానం. భర్త ఏ పనీ చేయకుండా నిత్యం మద్యం తాగడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున పడుకున్న భర్త తలపై బండరాయితో మోడీ హతమార్చింది. ఆపై మృతదేహం కనిపించకుండా చేయడానికి ముక్కలుగా నరికి బకెట్ లాంటి పాత్రలో గ్రామ శివారకు తరలించింది. తిరిగి ఇంటికి చేరుకుని రక్తపు మరకలు కనిపించకుండా భర్త బట్టలతోనే శుభ్రం చేసింది. వాటిని ఓ బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముక్కలుగా పడి ఉన్న శ్రీమంత్ మృతదేహం విషయంపై గ్రామంలో కలకలం రేగింది. దీంతో పోలీసుల రంగంలోకి దిగారు. ప్రాథమిక విచారణలో భార్య సావిత్రి చేసిన ఘోరాన్ని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.