బాలానగర్‌లో నవ వధువు ఆత్మహత్య
ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు
BY Raju Asari8 March 2025 9:53 AM IST

X
Raju Asari Updated On: 8 March 2025 9:53 AM IST
పెళ్లి అయిన నెలరోజులకే నవ వధువు ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్‌లో చోటుచేసుకున్నది. బాలానగర్‌లోని బాల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువున్నది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి పెండ్లి జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story