వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 వాహనాలు దగ్ధం
కాలిబూడిదైన 200 వాహనాలు
BY Raju Asari30 Nov 2024 12:54 PM IST

X
Raju Asari Updated On: 30 Nov 2024 12:54 PM IST
యూపీలోని వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో సుమారు 200 వాహనాలు కాలి బూడిదయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. వెంటనే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులతోపాటు 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 200 బైక్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలిపోయిన వాహనాల్లో రైల్వే అధికారులకు చెందినవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story