Telugu Global
CRIME

కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు.. విత్‌ డ్రా చేసుకున్నాం

సుప్రీంకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నామన్న బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌

కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు.. విత్‌ డ్రా చేసుకున్నాం
X

సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ ప్రకటించింది. ఢిల్లీలో కేటీఆర్‌ అడ్వకేట్ మోహిత్ రావు మాట్లాడుతూ.. మా లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని,కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా ఆప్పిల్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నదని అన్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ చేపట్టింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు.ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించామన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్ లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇంచార్జీ సోమ భరత్ కూమార్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కొన్ని మీడియా ఛానెల్స్ వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ - రేస్ ను హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ హయంలో నిర్వహించారు.ఇందులో అవినీతి జరిగిందని కేటీఆర్ పై రేవంత్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసిందన్నారు. అయితే చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నారు. ఈ దశలో హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. దీంతో సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాం. క్వాష్ పిటిషన్ విత్ డ్రా ను కొన్ని మీడియా ఛానెల్స్ వక్రీకరించాయని విమర్శించారు.

First Published:  15 Jan 2025 4:28 PM IST
Next Story