హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. - రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఈ ముఠాలో 8 మంది నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు సరఫరా చేస్తున్న మాదక ద్రవ్యాల పేరు ఎపిడ్రిన్. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. భారీ స్థాయిలో డ్రగ్స్‌ను విదేశాలకు తరలించేందుకు ప్లాన్ చేయగా, పోలీసులు సోమవారం వారి గుట్టు రట్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా ప్లాన్ చేసిన నిందితులు ఈ డ్రగ్స్‌ను విదేశాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠాలో 8 మంది నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు సరఫరా చేస్తున్న మాదక ద్రవ్యాల పేరు ఎపిడ్రిన్. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి చేసేవారని, తాజాగా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.
విదేశాలకు చెందిన పలువురు నిందితులతో పాటు, మన దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నిందితులు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు వారిపై దాడి చేసి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద మొత్తం 8 కేజీల ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.