యువతిపై సామూహిక లైంగిక దాడి
అక్కా-చెల్లెళ్ల ఇద్దరి పై నలుగురు లైంగిక దాడి చేశారు
BY Vamshi Kotas24 Feb 2025 10:16 AM IST

X
Vamshi Kotas Updated On: 24 Feb 2025 10:16 AM IST
తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పాంగ్ర బోర్గంకు చెందిన అక్కాచెల్లెళ్ళు నిజామాబాద్ వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుండగా, నమ్మించి కారులో ఎక్కించుకున్నారు ధనబండ తండాకు చెందిన ఇద్దరు యువకులు.అయితే…. మార్గ మధ్యంలో నల్గొండ నరసింహ స్వామి ఆలయం ప్రాంతానికి సమీపంలో తీసుకెళ్లి, మరో ఇద్దరు యువకులను పిలిపించుకొని యువతులపై లైంగిక దాడికి యత్నం చేశారు. వారి నుండి తప్పించుకుంది అక్క. కానీ చెల్లెలిపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడి చేశారు. స్థానికుల సమాచారంతో యువతిని ముళ్ళ పొదల్లో గుర్తించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Next Story