Telugu Global
CRIME

బెంగ‌ళూరులో గ్యాంగ్ రేప్‌.. - న‌డుస్తున్న‌ కారులోనే దారుణం

ఆ త‌ర్వాత అక్క‌డినుంచి వెళ్లిపోయిన యువ‌కుడు.. మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌ను వెంట‌బెట్టుకుని కొద్దిసేప‌టి త‌ర్వాత‌ మ‌ళ్లీ అక్క‌డికి వ‌చ్చాడు. యువ‌తి స్నేహితుడిని బెదిరించి అత‌న్ని అక్క‌డినుంచి పంపించివేశారు.

బెంగ‌ళూరులో గ్యాంగ్ రేప్‌.. - న‌డుస్తున్న‌ కారులోనే దారుణం
X

బెంగ‌ళూరు న‌గ‌రంలో ఓ యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. న‌డుస్తున్న కారులోనే న‌లుగురు యువ‌కులు ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. దాదాపు 4 గంట‌ల‌పాటు సాగిన ఈ దారుణ‌కాండ మార్చి 25వ తేదీ రాత్రి జ‌రిగింది. ఈ కేసులో నిందితుల‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

బెంగ‌ళూరు న‌గ‌రంలోని ఈజీపుర‌కు చెందిన ఓ యువ‌తి, ఆమె స్నేహితుడు క‌లిసి మార్చి 25వ తేదీ రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యంలో కోర‌మంగ‌ళ‌లోని పార్కులో కూర్చుని ఉన్నారు. వారిద్ద‌రూ సిగ‌రెట్ తాగుతుండ‌గా.. వారికి స‌మీపంలో కూర్చుని ఉన్న ఓ యువ‌కుడు పొగతో ఇబ్బందిగా ఉందంటూ వారితో వాగ్వాదానికి దిగాడు.

ఆ త‌ర్వాత అక్క‌డినుంచి వెళ్లిపోయిన యువ‌కుడు.. మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌ను వెంట‌బెట్టుకుని కొద్దిసేప‌టి త‌ర్వాత‌ మ‌ళ్లీ అక్క‌డికి వ‌చ్చాడు. యువ‌తి స్నేహితుడిని బెదిరించి అత‌న్ని అక్క‌డినుంచి పంపించివేశారు. అనంత‌రం మ‌రో స్నేహితుడికి ఫోన్ చేయ‌గా కారుతో అక్క‌డికి వ‌చ్చాడు. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో న‌లుగురూ క‌లిసి యువ‌తిని బ‌లవంతంగా కారులో ఎక్కించుకున్నారు.

న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో కారును తిప్పుతూ.. ఆ యువ‌తిపై న‌లుగురూ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ కాండ తెల్ల‌వారుజామున 3.30 గంటల వ‌ర‌కు సాగింది. అనంత‌రం ఈజీపుర‌లోనే రోడ్డుప‌క్క‌న ఆమెను వ‌దిలేసి యువ‌కులు వెళ్లిపోయారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన బాధితురాలు రెండు రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందింది. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితులైన‌ శ్రీ‌ధ‌ర్‌, కిర‌ణ్‌, స‌తీష్‌, విజ‌య్‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఈజీపుర వాసులే కావ‌డం గ‌మ‌నార్హం. నిందితులంతా 22-26 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సువారే.

First Published:  1 April 2023 8:35 AM IST
Next Story