ఈటల, డీకే అరుణ, ఏలేటి అరెస్ట్
లగచర్లకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
BY Naveen Kamera18 Nov 2024 6:00 PM IST

X
Naveen Kamera Updated On: 18 Nov 2024 6:00 PM IST
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, సమీప తండాల వాసులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్లలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈక్రమంలో పలువురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇండ్లల్లో ఉన్న మహిళలపై పోలీసులు అర్ధరాత్రి కరెంట్ తీసి వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు బీజేపీ నేతలు వెళ్తుండగా మొయినాబాద్ వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story