జమ్మూశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బెహిబాగ్ ప్రాంతంలోని కడ్గర్ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో గురువారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాద ఉనికికి సంబంధించి సమాచారం అందడంతో భద్రతా బలగాల, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్గర్ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతిదాడికి దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నది.
ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య వరుస కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పూంఛ్, రాజౌరీ తదితర జిల్లాల్లోనే క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర ముఠాలు ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ క్రీయాశీలకంగా మారాయి. ఈ ముఠాలపై భారత భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి.