Telugu Global
CRIME

మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

నాగచైతన్య- సమంతా విడాకులపై మంత్రి వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేసిన నాగార్జున

మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు
X

తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలపై మండిపడింది. విపక్ష పార్టీల నేతలు కూడా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాజకీయాల్లో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కోర్టు ఇవాళ రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

First Published:  10 Oct 2024 9:20 AM GMT
Next Story