తెలంగాణలో మరో మంత్రి ఇంట్లో చోరీ
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో సెల్ ఫోన్ చోరీ జరిగింది
తెలంగాణలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయంటే ఏకంగా రాష్ట్ర మంత్రుల ఇళ్లలోనే చోరీలు జరిగేంత దుస్థితి. నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈనెల 31వ తేదీన దీపావళి రోజున సెల్ ఫోన్ చోరీ అయింది. మొన్న కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు.
మంత్రుల ఇళ్లలోనే చోరీలు జరుతుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్ధం అవుతుంది. రాష్ట్రంలో హోం శాఖ మంత్రి లేడు..ముఖ్యమంత్రిలో చేతిలో హోం ఉన్న ఏం చేయలేని పరిస్థితి. ప్రశ్నించే జర్నలిస్టుల పై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప.. : శాంతిభద్రతలు గాలికి వదిలేశారు. రాష్ట్రంలో క్రైం రేటు విపరీతంగా పెరుగుతుంది అయితే.. ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అలర్ట్ అయ్యారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారట శ్రీధర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.