Telugu Global
CRIME

భార్య మిస్సింగ్ అని కంప్లైంట్.. పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు

భార్య మిస్సింగ్ అని పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ప్రతీ రోజు స్టేషన్‌కు వచ్చి తన భార్య ఆచూకీ తెలిసిందా అని ఆరా తీస్తున్నాడు.

భార్య మిస్సింగ్ అని కంప్లైంట్.. పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు
X

భార్య మిస్సింగ్ అని పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ప్రతీ రోజు స్టేషన్‌కు వచ్చి తన భార్య ఆచూకీ తెలిసిందా అని ఆరా తీస్తున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా విస్తుపోయే నిజాలను వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే..

బీహార్‌కు చెందిన పృథ్వీరాజ్ (28) అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం బెంగళూరుకు వలస వచ్చాడు. మారుతి లేఅవుట్‌లో నివాసం ఉంటూ.. ఎలక్ట్రానిక్ గూడ్స్ సప్లై వ్యాపారం చేస్తున్నాడు. 9 నెలల క్రితం ఆయన జ్యోతి కుమారి (38) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. బీహార్‌లోని తన సొంత గ్రామం పక్కన ఉండే సీతామర్హి అనే గ్రామానికి చెందిన యువతిని కుటుంబ సభ్యులు చూడగా పెళ్లి చేసుకున్నాడు. నాలుగు నెలల క్రితం ఆమెను కూడా బెంగళూరుకు తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో అగస్టు 5న తన భార్య తప్పిపోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

గతంలో కూడా రెండు సార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిందని.. కానీ ఈ సారి వెళ్లిన ఆమె ఇంకా రాలేదని బాధపడ్డాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసిందని.. ఎలాగైనా తన భార్యను వెతికి పెట్టమని కోరాడు. తాము ఢిల్లీకి వలస వెళ్దామని అడుగుతోందని.. తన వ్యాపారం వదిలేసి రానని చెప్పడంతోనే వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే పృథ్వీరాజ్ చెప్పే విషయాలకు పొంతన కుదరక పోవడంతో పాటు.. అగస్టు 1న భార్య, మరో స్నేహితుడు సమీర్ కుమార్‌తో కలసి ఉడిపి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.

తన భార్య జ్యోతికుమారి వయసు 38 అయినా.. తనకు 28అని చెప్పి పెళ్లి చేసుకుంది. దీంతో కొన్నాళ్లు మాట్లాడకుండా ఆమెను బీహార్‌లోనే వదిలి బెంగళూరు వచ్చాడు. అయితే మనసు మార్చుకొని ఆమెను క్షమించి బెంగళూరుకు తీసుకొని వచ్చానని పృథ్వీ చెప్పాడు. కానీ, అప్పటి నుంచి మాత్రం తనతో శారీరికంగా కలవడానికి మాత్రం ఆమె ఒప్పుకోవడం లేదు. పైగా గతంలో ఓ ఎంట్రెన్స్ టెస్ట్ సమయంలో పరిచయం అయిన వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందనే అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు.

అగస్టు 1న జూమ్ కార్‌ను అద్దెకు తీసుకొని స్నేహితుడు సమీర్, భార్య జ్యోతితో కలసి ఉడిపి వెళ్లాడు. అక్కడి మాల్పే బీచ్‌లో ఆమెను ముంచి చంపాలని భావించినా, జనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్లాన్ మార్చకున్నాడు. తిరుగు ప్రయాణంలో షిరాడి ఘాట్ వద్ద భార్యను చంపి శవాన్ని అడవిలో పారేశాడు. అనంతరం బెంగళూరు చేరుకొని పోలీసులకు భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు.

పృథ్వీరాజ్ చెప్పిన ఆధారాల ప్రకారం ఘాట్‌లోని అడవిలో వెతకగా.. కుళ్లిపోయిన స్థితిలో జ్యోతి శవం కనిపించింది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. పృథ్విర్యాజ్‌తో పాటు అతని స్నేహితుడు సమీర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

First Published:  17 Aug 2022 6:31 PM IST
Next Story