Telugu Global
CRIME

పని మనిషితో శృంగారం చేస్తూ గుండె పోటుతో మృతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఒక రోజు పని ఉందని చెప్పి బయటకు వెళ్లారు. నేరుగా పని మనిషి ఇంటికి వెళ్లి ఆమెతో సెక్స్ చేశాడు. అయితే శృంగారం చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండె పోటుకు గురై మరణించాడు.

పని మనిషితో శృంగారం చేస్తూ గుండె పోటుతో మృతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
X

అతను ఓ బడా వ్యాపారి. ఇటీవలే గుండె జబ్బుతో బాధపడుతూ యాంజీయోగ్రామ్ చేయించుకున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా.. పెడచెవిన పెట్టి శృంగారం చేశాడు. తనతో ఎప్పటి నుంచో సంబంధం ఉన్న పని మనిషి ఇంటికి వెళ్లి మరీ శృంగారంలో పాల్గొన్నాడు. కానీ అదే సమయంలో గుండె పోటుకు గురై మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన బాల సుబ్రహ్మణ్యం (67) నగరంలో బడా వ్యాపారిగా పేరున్నది. తన ఇంటిలో పని చేస్తున్న ఓ మహిళతో ఆయన ఎప్పటి నుంచో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని సార్లు మహిళ ఇంటికే వెళ్లి శృంగారం చేసేవాడు. అయితే వయసు మీద పడటంతో ఇటీవల ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

ఒక రోజు పని ఉందని చెప్పి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లారు. నేరుగా పని మనిషి ఇంటికి వెళ్లి ఆమెతో సెక్స్ చేశాడు. అయితే శృంగారం చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండె పోటుకు గురై మరణించాడు. దీంతో ఆ పని మనిషి భయభ్రాంతులకు గురైంది. విషయాన్ని భర్త, సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ వ్యాపారి అప్పుడప్పుడు తమ ఇంటికి వస్తుంటాడని భర్తకు తెలుసు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్నాడు. తన బావమరిదితో కలసి ఆ శవాన్ని ఒక ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి జేపీ నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.

సుబ్రహ్మణ్యం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి అతడు పని మనిషి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. పనిమనిషిని విచారించగా అసలు విషయం చెప్పింది. అప్పుడప్పుడు తమ యజమాని ఇంటికి వస్తుంటాడని.. ఈ విషయం భర్తకు తెలుసని వెల్లడించింది. ఆ రోజు శృంగారం చేస్తుండగా చనిపోవడంతో భయపడ్డానని.. హత్య కేసు నమోదు చేస్తారనే భయంతో భర్త సాయంతో శవాన్ని పడేసినట్లు ఒప్పుకున్నది.

పనిమనిషి, ఆమె భర్త, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టమ్ రిపోర్టు ఇంకా రాలేదని.. వచ్చిన తర్వాత ఇది నిజంగా గుండెపోటు కారణంగానే జరిగిందా? లేదా హత్య కోణం ఏమైనా ఉన్నదా అని తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

First Published:  25 Nov 2022 5:26 PM IST
Next Story