భయానక రీతిలో ట్రక్కును ఢీకొన్న రైలు
అనూహ్యంగా ప్రాణాలతో బైటపడిన ట్రక్క్ ట్రైవర్
BY Raju Asari14 March 2025 12:36 PM IST

X
Raju Asari Updated On: 14 March 2025 12:36 PM IST
మహారాష్ట్రలోని బోద్వాడ్ రైల్వే స్టేషన్సమీపంలో ఓ ట్రక్కును రైలు భయానక రీతిలో ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ అనూహ్యంగా ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ ఘటనలో ట్రక్కు దాదాపు ధ్వంసమైంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేసినప్పటికీ దాన్ని వేగంగా ఢీకొన్న ట్రక్కు పట్టాలవైపు దూసుకెళ్లిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముంబయి- అమరావతి ఎక్స్‌ప్రెస్ వచ్చి ట్రక్కును ఢీకొట్టినట్టు చెప్పారు. కొంతదూరం పాటు ఆ వాహనాన్ని ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బైటపడ్డాడని చెప్పారు. లోకో పైలట్ సహా రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతున్నదని చెప్పారు. ట్రక్కు శిథిలాలను తొలిగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Next Story