మెట్రో స్టేషన్ వద్ద బైకులు దగ్ధం చేసిన నిందితుడు అరెస్ట్
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా జకీర్‌ను పట్టుకున్న పోలీసులు
BY Raju Asari8 Dec 2024 4:36 PM IST
X
Raju Asari Updated On: 8 Dec 2024 4:36 PM IST
మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసిన వాహనాలను తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట జరిగిన ప్రమాదంలో ఐదు బైక్‌లను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బైక్‌ల దహనానికి కారణాలను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన వాహనాలను తగలబెట్టింది జకీర్ అలియాస్ బంటిగా గుర్తించారు. చాదర్‌ట్‌లోని శంకర్‌నగర్ దర్గా ప్రాంతానికి చెందిన జకీర్ ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసి అదుపులోని తీసుకున్నారు. జకీర్ గతంలోనూ ఇదే తరహాలో ఘటనలకు పాల్పడి పలు వాహనాలను దగ్ధం చేసి తప్పించుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story